• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వన్' ట్రైలర్: 'ఆహా' లో...

'వన్' ట్రైలర్: 'ఆహా' లో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్..!

By - Tupaki Desk
Update: 2021-07-27 10:01 GMT
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ''వన్''. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని 'ఆహా' ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న తెలుగు డిజిటల్ వేదిక 'ఆహా'.. ఈ చిత్రాన్ని అదే పేరుతో జూలై 30న స్ట్రీమింగ్ పెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'వన్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.

ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి.. ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు?, సీఎంగా అతనికి ఎదురైన రాజకీయ సవాళ్ళు ఏంటి? ప్రతిపక్షాలతోనే కాకుండా సొంత పార్టీ కుట్రలను ఎలా తట్టుకుని నిలబడ్డాడు? అనే కథాంశంతో ''వన్'' సినిమా తెరకెక్కింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి చంద్రమ్ పాత్రలో మమ్ముట్టి నటించారు.

'వన్' చిత్రంలో ముఖ్యమంత్రిగా మమ్ముట్టి గెటప్.. ఆయన హావభావాలు.. పలికిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. 'గవర్నమెంట్ ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం.. లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చూడటం.. ఇవే నేటి రాజకీయాల్లో ప్రతిపక్షాలు పోషిస్తున్న పాత్రలు' 'నేను ఈ 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాదు.. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి ముఖ్యమంత్రిని' అంటూ మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ అలరిస్తున్నాయి.

ఇందులో మురళీ గోపి - జగదీష్ - అలెన్సియర్ లే లోపేజ్ - నిమిషా సజయన్ - జోజు జార్జ్ - సుధీర్ కరమణ వంటి టాలెంటెడ్ నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బాబీ - సంజయ్ లు స్టోరీ అందించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. వైడీ సోమ సుందరమ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ చేశారు. ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారు ఈ నెల 30 నుండి 'ఆహా' లో ''వన్'' చిత్రాన్ని వీక్షించవచ్చు.



Full View



Tags:    
  • mammootty 
  • mammootty One Movie 
  • mammootty One Movie Trailer 
  • One Movie Ott 
  • One Movie Aha 
  • One Movie telugu version 
  • One Movie telugu trailer 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS