• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేటీఆర్`తో `వైఎస్...

కేటీఆర్`తో `వైఎస్ ఆర్`...వైర‌ల్!

By - Tupaki Desk
Update: 2018-07-20 11:52 GMT
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి నేడు భేటీ అయ్యారు. ఓ కార్య‌క్రమానికి కేటీఆర్ ను ఆహ్వానించేందుకు కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి మ‌మ్ముట్టి వెళ్లారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్న 'కైరాలి పీపుల్ ఇన్నొటెక్ అవార్డ్స్' కార్యక్రమానికి కేటీఆర్ ను ముఖ్య అతిథిగా మ‌మ్ముట్టి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా `చార్మినార్` ప్ర‌తిని మ‌మ్ముట్టికి కేటీఆర్ బ‌హూక‌రించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ - మ‌మ్ముట్టిలు కలిసి దిగిన‌ ఫోటోలను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ట్విట్ట‌ర్ అధికారిక ఖాతా అయిన `మినిస్ట‌ర్ ఐటీ - తెలంగాణ‌`లో పోస్ట్ చేశారు. మ‌ల‌యాళ మెగా స్టార్ తో కేటీఆర్ దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.  

మ‌హానేత‌ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న `యాత్ర` బ‌యోపిక్ లో మ‌మ్ముట్టి న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌నేత వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి న‌టిస్తుండ‌డంతో `యాత్ర‌`పై ఆ అంచనాలు మ‌రింత పెరిగాయి. ఇప్ప‌టికే విడుద‌లైన‌‘యాత్ర’ టీజ‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని 70ఎంఎం ఎంటర్‌ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ లో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన ఈ బ‌యోపిక్ ను వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.
Tags:    
  • Mammootty 
  • KTR 
  • Camp Office 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS