జాక్ పాట్ ఆఫర్ పట్టేసిన మల్లేశం హీరోయిన్

Update: 2019-12-18 07:03 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే కెమెరా ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్ సూపర్ హిట్ ఫిలిం 'పింక్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించబోతున్నారు.  ఈ సినిమాకు ఈమధ్యే ప్రారంభోత్సవం జరిగింది.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక అడ్వొకేట్ పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో మరో మూడు కీలకపాత్రలు ఉన్నాయి.  ఈ పాత్రలకోసం ముగ్గురు హీరోయిన్లను ఎంచుకుంటున్నారు.  అందులో అనన్యను ఒకరిగా ఎంచుకున్నారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అనన్య 'మల్లేశం' సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అటు ప్రియదర్శికి ఇటు అనన్యకు మంచి పేరు తీసుకొచ్చింది.  ఈ సినిమా ఒక్కటే కాదు.  'ప్లే బ్యాక్' సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.  ఈమధ్యే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లో 1993 నాటికాలం అమ్మాయిగా కనిపించింది. ఇప్పుడేమో ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా సినిమాలో ఆఫర్ సాధించింది.  కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఆఫర్ సాధించడంతో అనన్య ఫుల్ హ్యాపీగా ఉందట.

వేణు శ్రీరామ్ దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమా కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమాను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.  త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
Tags:    

Similar News