బాలీవుడ్ స్టార్లు రాకుండా మాల్దీవులకు తాళం వేశారు
కోవిడ్ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తాళం వేయాలి. ప్రస్తుతం ఎగ్జోటిక్ డెస్టినేషన్ మాల్దీవుల్లో అదే చేశారు. ఒక్క దెబ్బకు బాలీవుడ్ స్టార్లు సహా ఇండియా నుంచి వచ్చే సెలబ్రిటీల విహారయాత్రలకు అలా చెక్ పడింది.
భారతదేశంలో కోవిడ్ -19 రెండవ వేవ్ ప్రభావం అలా దుంప తెంచింది. ఇక్కడ వేవ్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కదిలించింది. ఇప్పటికే కెనడా- బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి యాత్రికుల్ని రానివ్వకుండా ఆపేసిన మాల్దీవులు భారతదేశం నుండి వచ్చే పర్యాటకులకు కొత్త ఆంక్షలను ప్రకటించింది.
గత కొన్ని నెలలుగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు .. సోషల్ మీడియా ప్రభావితం చేసేవారు మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అలియా భట్- రణబీర్ కపూర్- దిషా పటాని-టైగర్ ష్రాఫ్ విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లారు. భారతదేశం నుండి పర్యాటకులపై కొత్త మార్గదర్శకాలు ఆంక్షలను ద్వీప దేశం ప్రకటించక ముందే ఈ ప్రముఖులందరూ భారతదేశానికి తిరిగి వచ్చారు.
గత కొద్ది రోజులుగా బాలీవుడ్ తారలు తమ మాల్దీవుల విహారం నుంచి సెల్ఫీలు ఫోటోలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసినందుకు చాలా మంది దేశంలోని పరిస్థితుల్ని గుర్తు చేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. ఇకపై ఆ అవసరం లేదు.