ఒక్క పోస్టర్ ఆ నటి లైఫ్ మార్చనుందా..

Update: 2020-03-16 16:30 GMT
మాళవిక మోహనన్ ఈ పేరు నిన్నటి వరకు సినిమా ఇండస్ట్రీకి కూడా పెద్దగా పరిచయం లేదు. అలాంటిది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈమె గురించి చర్చ మొదలైందంటే మ్యాటర్ కాస్తా ఇంపార్టెంట్ అన్పిస్తుంది కదా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్. మరి సడన్ గా వైరల్ ఎందుకయ్యింది.. అంటే తమిళ ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న "మాస్టర్" సినిమా పోస్టర్ లో తళుక్కుమంది కాబట్టి. ఇటీవలే మాస్టర్ సినిమా టీం విజయ్ తో మాళవిక ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది.

అప్పటివరకు ఎవరికీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో పెద్దగా క్లారిటీ లేదు. ఒక్కసారిగా దళపతి విజయ్ పక్కన కనపడే సరికి అందరి కళ్ళు ఈమె మీదే పడ్డాయి. అప్పటి నుండి ఈమె ఎవరో కనుక్కోవడానికి సోషల్ మీడియా అంతా వెతకడం మొదలుపెట్టారు. మాళవిక మోహనన్ ఒక్క పోస్టర్ తో సినీ అభిమానులను తన వైపు తిప్పుకుంది. అది కూడా దళపతి విజయ్ పక్కన హీరోయిన్ అంటే మాటలు కాదు.

మాళవిక మలయాళ నటి. ఒకటి రెండు హిందీ, తమిళంలో చేసినా రావాల్సినంత గుర్తింపు రాలేదు. కానీ మాస్టర్ సినిమాలో తన పోస్టర్ రిలీజ్ చేసేసరికి అమ్మడు గాల్లో తేలిపోతుంది. అదీగాక విజయ్, విజయ్ సేతుపతి లాంటి సూపర్ స్టార్లతో లీడింగ్ రోల్ చేయడమంటే.. త్వరలోనే అమ్మడికి మంచి రోజులు రాబోతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. అందమైన నవ్వుతో కుర్రకారు మనసు దోచుకుంటుంది. మరి త్వరలోనే మన తెలుగు దర్శకనిర్మాతలు మాళవిక గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెప్తారేమో వేచిచూడాలి..
Tags:    

Similar News