యోగాభ్యాసం మ‌రీ ఇంత వేడిగానా మ‌లైకా?

Update: 2020-11-24 04:15 GMT
వేడెక్కించ‌డం ఆమెకో హ్యాబిట్. 50కి చేరువ‌వుతున్నా బోయ్స్ క‌ళ్లు త‌న‌వైపే తిప్పి చూడాలి. అమృతం తాగిన దేవ‌త‌ల జాబితాలో నిత్య య‌వ్వ‌నురాలిగా త‌న పేరుండాలి. అందుకోసం ఏమైనా చేస్తుంది. ఎంత‌కైనా తెగిస్తుంది. ఫిట్ బాడీ కోసం క‌ఠోర త‌పస్సు చేస్తుంది. జిమ్ .. యోగా.. ప్రాణాయామం.. రెగ్యుల‌ర్ వ‌ర్క‌వుట్లు..  దేనికైనా సై అనేస్తుంది. ఇదంతా ఎవ‌రి గురించో ప్ర‌త్యేకించి చెప్పాలా?   ది గ్రేట్ మ‌లైకా అరోరా.

మలైకా అరోరా జిమ్ యోగా ఫీట్స్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఊపిరాడ‌ని బిజీ షెడ్యూల్స్  లోనూ ఒక రోజు కూడా మిస్ కాకుండా జిమ్ చేయ‌డంలో త‌న త‌ర్వాతే. త‌న‌దైన స్టైలిష్ అథ్లెటిజర్ తో హెడ్ ట‌ర్న‌ర్ గా మారిన మ‌లైకా..  ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం త‌పించే తీరు ఎంద‌రికో స్ఫూర్తినిస్తుంది.

మ‌లైకా సోషల్ మీడియా చాటింగులో ప్రధాన వ్యాయామ లక్ష్యాలను నిర్ధేశిస్తుంది.  నిరంత‌రం తన యోగా క్లాస్ పోస్ట్ సెషన్  కెమెరా క‌ళ్లు త‌న‌ని బంధించేందుకు త‌ప‌న ప‌డుతుంటాయి.

లేటెస్టుగా యానిమ‌ల్ ప్రింటెడ్ టైట్ డ్రెస్ లో యోగాభ్యాసం చేసి తిరిగి ఇంటికి వెళుతుంటే కెమెరా క‌ళ్లు ఇదిగో ఇలా బంధించాయి.  ఆఫ్ వైట్ జాకెట్ .. బ్లాక్ మాస్క్ ని ధ‌రించి తన యోగా చాపను చేతిలో పట్టుకొని మ‌లైకా స్టైలిష్ గా కనిపించింది. సోషల్ మీడియాలో మ‌లైకా జిమ్ లుక్ వైర‌ల్ గా మారింది.

కరీనా కపూర్ ఖాన్- అర్జున్ కపూర్- సైఫ్ అలీ ఖాన్ - తైమూర్ అలీ ఖాన్ ల‌తో కలిసి మ‌లైకా ఇటీవల `ధర్మశాల`లో సెల‌బ్రేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తన దినచర్యకు సంబంధించిన స్నీక్ పీక్ ని అభిమానుల‌కు షేర్ చేసింది. కెరీర్ సంగ‌తి చూస్తే.. ప్ర‌స్తుతం డ్యాన్స్ రియాలిటీ షోలో గీతా కపూర్ - టెరెన్స్ లూయిస్ తో క‌లిసి జ‌డ్జిగా కనిపిస్తోంది.
Tags:    

Similar News