బ్యాక్ లెస్ ఫోజ్ తో అగ్గి రాజేసిన మ‌లైకా

Update: 2022-06-18 02:30 GMT
వైన్ ఎంత ఎక్కువ‌గా నిల్వ ఉంటే అంత అద్భుత‌మైన కిక్కునిస్తుంది.  ఇప్పుడు ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం అలానే ఉంది. ఎంత‌గా ఏజ్ బార్ అవుతున్నా అంత‌కుమించి అనేలా బోల్డ్ లుక్ తో క‌వ్విస్తోంది. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. ది గ్రేట్ మలైకా అరోరా గురించి. మంచి వైన్ లాగా ఈ అమ్మ‌డు ఏజ్ బార్ అయ్యే కొద్దీ న‌వ‌న‌వ‌లాడుతోంది.

కాస్త సీనియ‌ర్ల‌లో అత్యుత్తమ ఫ్యాషన్ సెన్స్ ఉన్న టాప్ ట్యాలెంటెడ్ బ్యూటీగా మ‌లైకా పేరు మార్మోగుతోంది.  తాను ఎంపిక చేసే ప్ర‌తి డ్రెస్ యూనిక్ స్టైల్ తో ఆక‌ట్టుకుంటాయ‌న‌డంలో సందేహం లేదు. వెస్ట్ర‌న్ లుక్ మోడ్ర‌న్ లుక్ లేదా ట్రెడిష‌న‌ల్ లుక్ ఎలా క‌నిపించినా మ‌లైకా యూనిక్ నెస్ ని ప్ర‌ద‌ర్శించ‌డంలో త‌న త‌ర్వాతే. తాజాగా మ‌లైకా నెవ్వ‌ర్ బిఫోర్ లుక్ తో వేడి పెంచింది. మెటాలిక్ షిమ్మ‌రీ దుస్తుల్లో త‌ళ‌త‌ళా మెరిసింది. ఈ స‌రికొత్త డిజైన‌ర్ దుస్తులలో మ‌లైకా అందం యువ‌త‌రాన్ని ఒక రేంజులో క‌వ్విస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్  ఇంటర్నెట్ లో అగ్గి రాజేసింది. మలైకా అరోరా గురువారం తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బ్యాక్ లెస్ గోల్డెన్ గౌనులో పోజులిచ్చిన కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. ఈ డ్రెస్ ర్యాట్ & బోవా రాక్ షెల్ఫ్ ల నుండి ఎంపిక చేసుకున్న‌ది. హాల్టర్ నెక్... కౌల్ నెక్ ఫిగర్-స్కిమ్మింగ్ కట్ తో ఓల్డ్ స్టైల్ దుస్తులు నిస్సందేహంగా హెడ్ ట‌ర్న‌ర్ గా నిలిచాయి. లిక్విడ్ మెటాలిక్ క‌ల‌ర్ తో ఈ డిజైన‌ర్ గౌను విలువ రూ. 16కె.

ఇక బ్యాక్ లెస్ ఫోజ్ తో మ‌లైకా కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. ఇక మ‌లైకా ఇటీవ‌లే షైనీ గ్రీన్ బ్లేజ‌ర్ లో క‌నిపించిన ఫోటోలు కూడా అంత‌ర్జాలంలో అగ్గి రాజేసాయి. ఇక మ‌లైకా ఇన్ స్టాలో నిరంత‌రం షేర్ చేస్తున్న ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో దుమ్ము రేపుతున్నాయి. ఇక లేట్ ఏజ్ లోనూ మ‌లైకా ఈ రేంజులో చెల‌రేగ‌డం వెన‌క కోట్లాది రూపాయ‌ల విలువ చేసే బ్రాండ్స్ భ‌విష్య‌త్ ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. త‌న‌కు ఉన్న భారీ సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ వ‌ల్ల తాను గొప్ప సంపాద‌కురాలిగా వెలిగిపోతోంది.
Tags:    

Similar News