ఫోటో స్టోరి: మ‌తి చెడేలా మ‌లైకం ధ‌గ‌ధ‌గ‌లు

Update: 2021-09-04 10:30 GMT
బాలీవుడ్ హాట్ ఐటంబాంబ్ మ‌లైకా ఆరోనా యాభై కి చేరువ‌లో ఉన్నా ఇప్ప‌టికీ యువ‌త‌రంలో మంట‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కంటే ప‌దేళ్ల‌ చిన్న‌వాడైన అర్జున్ క‌పూర్ తో డేటింగ్  న‌డిపిస్తూనే.. మ‌రోవైపు ఇన్ స్టాలో లేటెస్ట్ టెంప్టింగ్ ఫోటో షూట్ల‌తో విరుచుకుప‌డుతూ అంద‌రి అటెన్ష‌న్ త‌న‌వైపు తిప్పేసుకుంటోంది.

బాలీవుడ్ లో ఎవ్వ‌ర్ గ్రీన్ ఫ్యాష‌నిస్టాగా మ‌లైకా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. నేటిత‌రంతో పోటీప‌డుతూ ఈ భామ ఆదాయ ఆర్జ‌న‌లోనూ స్కై ఈజ్ లిమిట్ అన్న తీరుగా దూసుకుపోతోంది. నిరంత‌రం ఫ్యాషన్ ప్ర‌పంచ‌పు రాణిగా ఏల్తోంది. లేటెస్ట్ అల్ట్రా మోడ్ర‌న్ గెట‌ప్స్ లోనూ  విరుచుకుప‌డుతూ కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిస్తోంది.  

తాజాగా మ‌లైకా ఓ కొత్త డిజైన్ లుక్ లో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది. మ‌ల్టీక‌ల‌ర్ డిజైనర్ డ్రెస్ ధ‌రించి కిల్లింగ్ లుక్స్ తో మెరుపులు మెరిపించింది.   విభిన్న రంగుల‌తో కూడిన ఆ డిజైన‌ర్ డ్రెస్ మిరుమిట్లు  గొలుపుతోంది. 47 ఏళ్ల మ‌లైకా స్వీట్ 16 లోకి ప్ర‌వేశించిందేమిటి? అంటూ యూత్ ఫిదా అయిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి. ఫోటో షూట్లో భాగంగా నియాన్ కాంతుల‌  లైటింగ్ సెట‌ప్ న‌డుమ మలైకా విగ్ర‌హంలా ఫోజివ్వ‌డం షాకిస్తోంది.

మ‌లైకా దేహ‌శిరులను ఎలివేట్ చేస్తూ లైటింగ్ ప్ర‌కాశ‌వంతంగా ఫోక‌స్ చేయ‌టంతో ఆ డ్రెస్ మ‌రింత వ‌న్నె తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో  వైర‌ల్ అవుతోంది. హాట్ మ‌లైకాను చాలా కాలం త‌ర్వాత  ఫుల్ క‌వ‌ర్డ్ గౌనులో.. అదీ సంథింగ్ స్పైసీ లుక్ లో చూడ‌టంతో అభిమానులు త‌నువు పుల‌కించిపోతోంది. ఇలా ఎంత‌గా హోయ‌లు పోయినా మ‌లైకాకు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో ఛాన్సులొస్తున్నాయి కానీ.. పెద్ద తెర నాయిక‌గా అవ‌కాశాలివ్వ‌డానికి బాలీవుడ్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ముందుకు రావ‌డం లేదు. `దిల్ సే` సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ  ఇచ్చిన మ‌లైకాకు తొలి నుంచి ఐట‌మ్ భామ‌గానే గుర్తింపు ద‌క్క‌డం ఒక‌ర‌కంగా మైన‌స్ అయ్యింది. త‌ర్వాత చాలా మంది స్టార్ హీరోల చిత్రాల్లో ఐటం భామ‌గా  న‌ర్తించాల్సొచ్చింది. తెలుగులో `అతిధి`  సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు.

తర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `గ‌బ్బ‌ర్ సింగ్` లో కెవ్వుకేక  పాట‌తో టాలీవుడ్ యూత్ ని ఓ ఊపు ఊపేసింది. అప్పుడు కూడా మ‌లైకా వ‌య‌సు గురించి టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చే సాగింది. ఆ త‌ర్వాత మ‌రో ఛాన్స్ రాలేదు. బాలీవుడ్ లో  అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో బుల్లి తెర‌పైనా ఎంట్రీ ఇచ్చింది.  ప్ర‌స్తుతం బుల్లి తెర రియాలిటీ షోల‌తో పూర్తి యాక్టివ్ గా ఉంది.

కుర్ర‌హీరో అర్జున్ తో ఎఫైర్ క‌హానీ..

హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగిపోవ‌డం ఎలానో మ‌లైకా- అర్జున్ జంట‌ను చూసి నేటి త‌రం ఫాలో అయిపోతోందంటే అర్థం చేసుకోవాలి.మలైకా అరోరా - అర్జున్ కపూర్ ప్రేమాయ‌ణం నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఆ ఇద్ద‌రూ ఎవ‌రికి వారే కెరీర్ ప‌రంగా బిజీ. కానీ తమ బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని ఒక‌రితో ఒక‌రు ప్రేమైక జీవ‌నం సాగిస్తున్నారు.  నిరంత‌ర రొమాంటిక్ డిన్న‌ర్ డేట్ ల‌తో యూత్ ని ప‌ల‌క‌రిస్తూనే ఉంది ఈ జంట‌.  వీకెండ్స్ లో ఈ జంట త‌మ బంగ్లాలోనే రొమాంచిత జీవితాన్ని ఆస్వాధిస్తున్న ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

అర్జున్ - మలైకా అరోరా జంట‌కు నెటిజ‌నుల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఈ జంట ప్ర‌తిదీ సోష‌ల్ మీడియాలో ఓపెన్ గా ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. 2019 లో అర్జున్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా వారు ఇన్ స్టాగ్రామ్ లో త‌మ అనుబంధాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. మలైకా అరోరా గతంలో సినీ నిర్మాత కం న‌టుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. వారు 19 సంవత్సరాల వైవాహిక జీవితం అనంత‌రం విడిపోయారు. 2017 లో విడాకులు తీసుకున్నారు. వారు 19 ఏళ్ల అర్హాన్‌కు తల్లిదండ్రులు. విడాకుల అనంత‌రం అర్జున్ - మలైకా ల‌వ్వాయ‌ణం నిరంత‌రం హాట్ టాపిక్. మలైకా అరోరా కెరీర్ విష‌యానికి వ‌స్తే.. చివరిగా డ్యాన్స్ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ జ‌డ్జిగా కొన‌సాగారు. కొరియోగ్రాఫర్స్ టెరెన్స్ లూయిస్ - గీతా కపూర్ తో కలిసి న్యాయనిర్ణేతలలో ఒకరిగా కనిపించారు.  రెండ‌వ సంవత్సరంలో `సూపర్ మోడల్‌` షోలో జ‌డ్జిగా క‌నిపించ‌నున్నారు.
Tags:    

Similar News