• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేకింగ్ వీడియో: 'కొండ...

మేకింగ్ వీడియో: 'కొండ పొలం' కోసం మామూలుగా కష్టపడలేదుగా..!

By - Tupaki Desk
Update: 2021-10-05 16:39 GMT
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ''కొండ పొలం'' సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇదొక అటవీ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ మూవీ. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.

'కొండ పొలం' చిత్రాన్ని దట్టమైన అడవులు - కొండ ప్రాంతాల్లో రాత్రిమ్భావళ్ళు చాలా కష్టపడి తీసినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. నటీనటులు దర్శకుడు ఇతర మరియు సిబ్బంది.. ఇలా అందరి శ్రమ ఇందులో కనిపిస్తోంది. అడవుల్లోకి అధిక సంఖ్యలో గొర్రెలను తీసుకెళ్లి.. ఆ మూగ జీవాలను కంట్రోల్ చేస్తూ వాటి మధ్యనే షూటింగ్ జరిపినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ కోసం వైష్ణవ్ తేజ్ ఫీట్లు కూడా చూడొచ్చు. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ భాగం షూట్ చేశారు. తక్కువ రోజుల్లో ఎక్కువ క్వాలిటీ సినిమా తీసి క్రిష్.. ఈ సినిమాని అడవుల్లో ఏకధాటిగా 40 రోజులు షూటింగ్ తో పూర్తి చేశారని తెలుస్తోంది.

'కొండ పొలం' చిత్రంలో గొర్రెల కాపరుల ఫ్యామిలీకి చెందిన రవీంద్ర యాదవ్ అనే ఓ కుర్రాడు తనలోని భయాల్ని జయించి బయటికి రావడానికి అడవి ఎలా దోహదం చేసిందనేది ఈ కథలో ఆసక్తికరంగా చూపించబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఇది సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన 'కొండ పొలం' నవల ఆధారంగా రూపొందింది. ఇందులో ఓబులమ్మ పాత్రలో రకుల్ అలరించనుంది. సాయి చంద్ - కోట శ్రీనివాసరావు - నాజర్ - అన్నపూర్ణ - హేమ - ఆంథోనీ - రవి ప్రకాష్ - రచ్చ రవి - మహేష్ విట్టా - ఆనంద్ విహారి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'కొండ పొలం' సినిమా తెరకెక్కుతోంది. సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి నిర్మాతలు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఎంతో వ్యయప్రయాసలు పడి రూపొందించిన 'కొండ పొలం' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Full View
Tags:    
  • Kondapolam 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS