అడవి శేష్ 'మేజర్' ఫస్ట్ లుక్ విడుదల..!

Update: 2020-12-17 04:54 GMT
టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మేజర్''. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 'గూఢ‌చారి' ఫేమ్‌ శ‌శి కిర‌ణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇటీవల సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు విడుదల చేసిన 'మేజర్' లుక్‌ టెస్ట్ వీడియో కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

నేడు(డిసెంబర్‌ 17) హీరో అడవి శేష్‌ పుట్టినరోజు సందర్భంగా 'మేజర్' ఫస్ట్ లుక్‌ ను మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. శేష్ కి బర్త్ డే విషెస్ తెలిపిన మహేష్.. 'మేజర్' తన బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పగలనని ట్వీట్ చేసాడు. తెలుగు - ఇంగ్లీష్ - హిందీ భాషల్లో రిలీజ్ చేయబడిన ఈ పోస్టర్ లో అడవి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది. శత్రువులకు గన్ ఎక్కుపెట్టి తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడవి శేష్ ఒదిగిపోయినట్లు అర్థం అవుతోంది. ఈ సందర్భంగా 'మేజర్' చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Tags:    

Similar News