• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా హీరోతో 'మజిలీ'...

మెగా హీరోతో 'మజిలీ' మేకర్స్..?

By - Tupaki Desk
Update: 2021-06-25 13:30 GMT
నాగచైతన్య హీరోగా నటించిన 'మజిలీ' సినిమాతో ప్రొడక్షన్ లోకి దిగిన నిర్మాతలు హరీష్ పెద్ది - సాహు గారపాటి.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ‘గాలి సంపత్’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే 'టక్ జగదీష్' సినిమా త‌రువాత షైన్ స్క్రీన్స్ వారు భారీ ప్లాన్స్ వేస్తున్నారని తెలుస్తోంది.

'ఉప్పెన' సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తో హరీష్ పెద్ది - సాహు గారపాటి ఓ సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలానే ఓ స్టార్ హీరోతో 'ఎక్స్ ప్రెస్ రాజా' ఫేమ్ మేర్ల‌పాక గాంధీ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. వీటికి సంబంధించిన వివ‌రాలు 'ట‌క్ జగదీష్' సినిమా రిలీజ్ త‌రువాతే బ‌య‌ట‌కు వ‌స్తాయని తెలుస్తోంది. ఇదిలావుండగా నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న సినిమా కూడా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైనే రూపొందనుందని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.




Tags:    
  • Vaishnav 
  • Newmovies 
  • Tollywood 
  • Movies 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS