‘యాత్ర’ దర్శకుడి సాహస నిర్ణయం

Update: 2020-08-01 03:30 GMT
ప్రముఖ దర్శకులు ఓటీటీ కోసం వెబ్‌ సిరీస్‌ లను తెరకెక్కించడంలో నిర్మించడంలో నిమగ్నం అయ్యారు. ఈ ఏడాది మొత్తం కూడా సినిమాల షూటింగ్‌ కు స్టార్స్‌ ఆసక్తి చూపడం లేదు. దాంతో చాలా మంది కూడా వెబ్‌ కంటెంట్‌ పై దృష్టి పెట్టారు. థియేటర్లు మూతబడి ఉన్న కారణంగా ప్రేక్షకులు వెబ్‌ సిరీస్‌ లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే పద్దతి కొనసాగే అవకాశం ఉంది కనుక ముందు ముందు మరిన్ని వెబ్‌ సిరీస్‌ లు స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ నుండి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో ‘యాత్ర’ చిత్ర దర్శకుడు మహి వి రాఘవ దావూద్‌ ఇబ్రహీం పై వెబ్‌ సిరీస్‌ ను చేయబోతున్నాడు.

మాజీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోపిక్‌ ను ‘యాత్ర’ టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన మహి వి రాఘవ ఇప్పుడు అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం జీవిత చరిత్ర ఆధారంగా వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించాడు. తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడం మలయాళంలో కూడా ఈ వెబ్‌ సిరీస్‌ ను ప్రముఖ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాను. ఆయన జీవితంలోని ఎన్నో కీలక సంఘటనలు మరియు వివాదాస్పద విషయాలను తాను తెలుసుకున్నాను. వాటిని తెరపై పెట్టబోతున్నాను. ఇండియా మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ అయిన దావూద్‌ ఇబ్రహీం బయోపిక్‌ అంటే చాలా పెద్ద సాహస నిర్ణయం. ఆయన ప్రస్తుతం ఇండియాలో లేకున్నా ఆయన ఫాలోవర్స్‌ ఆయన వల్ల లాభం పొందిన వారు చాలా మందే ముంబయిలో ఉండి ఉంటారు. అలాంటి వారితో ఈ వెబ్‌ సిరీస్‌ కు దాన్ని తెరకెక్కించబోతున్న మహి వి రాఘవకు ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News