• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌హేష్ వ‌ర్సెస్ విజ‌య్.....

మ‌హేష్ వ‌ర్సెస్ విజ‌య్.. ఫ్యాన్స్ దారుణ‌ విద్వేషం?

By - Tupaki Desk
Update: 2022-09-06 06:35 GMT
సోష‌ల్ మీడియాల్లో వికృత చేష్ట‌లు దారుణ‌ వ్యాఖ్య‌ల గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. సైబ‌ర్ క్రైమ్ లో ఈ త‌ర‌హా కేసులు అధిక‌మ‌య్యాయి. ఇక స్టార్ల విష‌యంలో ఫ్యాన్స్ అత్యుత్సాహం త‌ప్పుడు కూత‌లు చాలాసార్లు ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇప్పుడు తెలుగు సూప‌ర్ స్టార్ మ‌హేష్ .. త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి బాలీవుడ్ లేదా టాలీవుడ్ కోలీవుడ్ అన్నిచోట్లా మాస్ అభిమానుల విధానం ఒక్క‌టే. సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌ప్పుడు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. తార‌ల వ్య‌క్తిగ‌త జీవితాల‌పై కామెంట్లు చేస్తున్నారు. చెత్త కామెంట్ల‌తో హ్యాష్ ట్యాగ్ లు ప్రతిసారీ ట్రెండింగ్ అయ్యేలా చేస్తున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్లు ద‌ళ‌పతి విజయ్ - మహేష్ బాబు ఫ్యాన్ వార్ దీనినే త‌ల‌పిస్తోంది. ఇరువురి అభిమానులు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు.. గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు.

ద‌ళ‌పతి విజయ్ ప్రతి సంవత్సరం గూగుల్ లో ట్రెండింగ్ జాబితాలో ఉంటాడు. ట్విట్టర్ లోనూ అత‌డికి అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఈ రోజు మహేష్ బాబు అభిమానులు ఎటువంటి కారణం లేకుండానే ద‌ళ‌పతి విజయ్ ని  ట్రోల్ చేయడం ప్రారంభించారు. పొక్కిరి- ఒక్కడు వంటి సినిమాలను 4కే లో రీమాస్ట‌రింగ్  చేయడంతో ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ లో కొందరు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా తమిళ రీమేక్ పోక్కిరి అప్ప‌ట్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ద‌ళ‌పతి విజయ్ -అసిన్ ప్రధాన పాత్రలు పోషించారు.

మ‌హేష్ 'ఒక్క‌డు' తమిళంలో 'గిల్లి' (విజ‌య్ హీరో) పేరుతో రీమేక్ అయింది. సోషల్ మీడియాలో నేషనల్ ట్రోల్ మెటీరియల్ విజయ్ అనే హ్యాష్ ట్యాగ్ లను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అయితే "అవమానాన్ని భరించేవాడు కాదు మావాడు!" అంటూ విజయ్ అభిమానులు #BoycottGayMaheshBabu ట్రెండింగ్ ని ప్రారంభించారు. ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసే కొన్ని అసహ్యకరమైన ట్వీట్లు వైర‌ల్ గా మారుతున్నాయి.

మ‌హేష్ రూపాన్ని మార్ఫింగ్ చేసి అస‌భ్య‌మైన ఫోటోల‌ను పోస్ట్ చేయ‌డంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 4 కే మాస్ట‌రింగ్ చేసి విడుద‌ల చేసిన మ‌హేష్ సినిమాల‌కు అభిమానులు ఎంతో గొప్ప‌గా ఆద‌రించారు. అదే త‌ర‌హాలో విజ‌య్ ఫ్యాన్స్ చేసి ఉంటే బావుండేది. ఊహించ‌ని రీతిలో ఇప్పుడు అగ్లీగా సోష‌ల్ మీడియా వార్ న‌డిపించ‌డం అహేతుకం అన్న వాద‌నా వినిపిస్తోంది.

మ‌హేష్ బాబు ఇప్పుడు వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. త‌దుప‌రి త్రివిక్ర‌మ్ తో సినిమాని వేగంగా పూర్తి చేసి రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. జ‌క్క‌న్న మూవీలో మ‌హేష్‌  స్పై అవతార్ లో క‌నిపిస్తార‌ని... ఇది భారీ యాక్షన్ చిత్రంగా తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం అందింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి పనిచేస్తున్నారు. అలాగే దళపతి విజయ్ కెరీర్ స్వింగ్ లో ఉంది. అత‌డు రష్మిక మందన‌తో కలిసి దళపతి 66 లో న‌టిస్తున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • FanWar 
  • MaheshBabu 
  • VijayThalapathy 
  • SocialMediatrolls 
  • Kollywood 
  • BoycottgayMaheshBabu 
  • Rajamouli 
  • Trvikram 
  • MovieNews 

Similar News

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS