మహేష్ బాబు-త్రివిక్రమ్ షూటింగ్ ప్రారంభం
మహేష్ బాబుతో త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎప్పుడూ సూపర్ క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లో అత్యంత క్రేజీ కాంబినేషన్ లలో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం మురుగదాస్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్. మరోవైపు పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రారంభానికి సిద్ధమయ్యాడు త్రివిక్రమ్.
ఇలాంటి సమయంలో మహేష్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో షూటింగ్ ఎలా సాధ్యమనే ప్రశ్న సహజమే కానీ.. ఇది వాస్తవమే. కాకపోతే ఇది ఫీచర్ ఫిలింకి సంబంధించిన షూటింగ్ కాదు. ఓ యాడ్ ఫిలిం షూటింగ్ మాత్రమే. తాజాగా లాయిడ్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన మహేష్.. ఇప్పుడా యాడ్ షూటింగ్ ప్రారంభించాడు. ఈ వ్యాపార ప్రకటనకు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనుండడం విశేషం. గతంలో కూడా అభిబస్ తో పాటు మరో యాడ్ కు కూడా వీరిద్దరూ కలిసి పని చేశారు.
సినిమాలతో సమానంగా యాడ్ ఫిలిమ్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్.. మురుగదాస్ తో తెరకెక్కిస్తున్న చిత్రానికి చిన్న బ్రేక్ ఇచ్చి మరీ ఈ యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొన్ని రోజుల్లోనే దీన్ని పూర్తి చేసేసి మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ చిత్రాన్ని.. జూన్ 23న రిలీజ్ చేసేందుకు మురుగ అండ్ మహేష్ సిద్దమవుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/