అప్డేట్స్ పై కంగారులో మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే??

Update: 2021-05-26 15:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబు సరసన మొదటిసారి కీర్తిసురేష్ నటిస్తోంది. గతేడాది సరిలేరు నీకెవ్వరూ మూవీతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మహేష్.. కొన్నేళ్లుగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. 2015 నుండి శ్రీమంతుడు నుండి వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో సక్సెస్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' మూవీ పై ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజిలో నెలకొన్నాయి. అయితే సర్కారు పాట టైటిల్ నుండి మోషన్ పోస్టర్ వరకు అన్ని ఈ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసాయి.

డైరెక్టర్ పరశురామ్ కూడా సర్కారు మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మహేష్ అభిమానులకు సర్కారు పాట పక్కా అదిరిపోయే ట్రీట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు మేకర్స్. డైరెక్టర్ పరశురామ్ - మహేష్ కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. దూకుడు - బిజినెస్ మెన్ - ఆగడు మ్యూజికల్ హిట్స్ తర్వాత తమన్ ఇప్పుడు మళ్లీ మహేష్ తో మళ్లీ తమన్ వర్క్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రతి ఏడాది మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఏదొక అప్డేట్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తాడు మహేష్. మరి ఇప్పుడు మే 31 ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి సర్కారు వారి పాట నుండి న్యూ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

అలాగే ఓవైపు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సూపర్ స్టార్ సినిమాలకు సంబంధించిన ప్రతిదీ అభిమానులు ట్విట్టర్ వేదికగా రికార్డులు బ్రేక్ చేసే విషయం తెలిసిందే. ఇప్పటికి మహేష్ ట్వీట్లకు సంబంధించి లైక్స్ - రీట్వీట్స్ రికార్డులు అలాగే ఉన్నాయి. ఈసారి అంతకుమించి ఉండేలా సంచలనం సృష్టించాలని ఫ్యాన్స్ ప్లాన్ వేస్తున్నారు.మైత్రి మూవీస్ తో పాటుగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ - జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో మహేష్ -త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ నుండి కూడా అప్డేట్ రానుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అసలు మహేష్ నుండి అప్డేట్స్ వస్తాయో రావో అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే మహేష్ ఫ్యామిలీకి బాగా సన్నిహితుడైన పిఆర్ఓ బిఏ రాజు మరణించారు. ఆయన మరణంతో మహేష్ ఫ్యామిలీ విషాదంలో ఉన్నారట. అందుకే ఇప్పుడు అప్డేట్స్ ప్లాన్ కాన్సల్ చేసినట్లు పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ మహేష్ ఫ్యాన్స్ లో మాత్రం అప్డేట్స్ రావేమో అని కంగారు మొదలైంది. చూడాలి మరి మే 31న ఏం జరగనుందో..!
Tags:    

Similar News