కల్కి 2 కమల్ విశ్వరూపం..?
నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమా సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కాగా ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అప్పుడే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.;
నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమా సీక్వెల్ పనులు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కాగా ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో అప్పుడే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఐతే కల్కి 2 లో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కల్కి 1లో సుప్రీం యాస్కిన్ గా కనిపించిన కొద్దిసేపు అదరగొట్టారు కమల్ హాసన్. ఐతే కల్కి 2లో భైరవ వర్సెస్ సుప్రీం యాస్కిన్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ కల్కి 1లోనే అశ్వద్ధామ రోల్ లో ఒక రేంజ్ లో ఇంప్రెస్ చేయగా కల్కి 2లో ఆయన రోల్ కూడా మరింత బలంగా ఉంటుందట.
ప్రభాస్ కి ఈక్వెల్ పోర్షన్ గా కమల్ హాసన్..
ఐతే కల్కి 2లో ప్రభాస్ కి ఈక్వెల్ పోర్షన్ గా కమల్ హాసన్ రోల్ ఉంటుందట. అంతేకాదు ఆ పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం చూపిస్తారని టాక్. ఆల్రెడీ కమల్ 250 సినిమాల్లో ప్రతి పాత్ర ఆయన్ను ప్రేక్షకులకు కొత్తగా చూపిస్తూ వచ్చారు. ఐతే ఈసారి సుప్రీం యాస్కిన్ రెండో భాగం మరింత స్ట్రాంగ్ గా ఎవరు ఊహించని విధంగా ఉంటుందట. నాగ్ అశ్విన్ రాయడమే అంత క్రేజీగా ఉందంటే ఇక కమల్ తెర మీద చించేస్తారని చెప్పొచ్చు.
కల్కి లో తన రోల్ చెప్పినప్పుడే ఎగ్జైట్ అయిన కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ కి పార్ట్ 1లో కొద్ది సీన్స్ మాత్రమే పడ్డాయి. ఐతే అసలు సుప్రీం యాస్కిన్ ఏం చేస్తాడు అన్నది రెండో పార్ట్ లోనే ఉంటుంది. అందుకే కమల్ కూడా కల్కి 2 కోసమే ఆసక్తిగా ఉన్నారు. విక్రం తో కమర్షియల్ హిట్ లో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన కమల్ హాసన్ కల్కి 2లో తన రోల్ లో మరోసారి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తారని అంటున్నారు.
త్వరలోనే సెట్స్ మీదకు కల్కి 2..
కల్కి 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ తో పాటు కమల్ హాసన్ కూడా బల్క్ డేట్స్ ఇస్తున్నారట. సో సుప్రీ యాస్కిన్ రోల్ తో కమల్ మరోసారి తన వర్సటాలిటీ చూపించబోతున్నారు. ఆల్రెడీ సీజీ వర్క్ పనులు మొదలు పెట్టారు కాబట్టి టాకీ పార్ట్ పూర్తైతే 2027 ఎండింగ్ కల్లా కల్కి 2 రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుంది.
కమల్ హాసన్ ఏ రోల్ చేసినా అందులో తిరుగు ఉండదు. ఐతే కల్కి 1లో సుప్రీం యాస్కిన్ గా శాంపిల్ చూపించిన ఆయన పార్ట్ 2లో మరోసారి తన విశ్వరూపం తో ఫ్యాన్స్ కి జోష్ అందిస్తారని తెలుస్తుంది.