• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ ను మార్చాలంటే...

మహేష్ ను మార్చాలంటే మాంత్రికుడికే సాధ్యం

By - Tupaki Desk
Update: 2022-09-13 02:30 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి చాలా కాలం అవుతుంది. శ్రీమంతుడు సినిమా తర్వాత మళ్లీ అలాంటి బలమైన సక్సెస్ అయితే పడింది లేదు. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఆ తర్వాత 'భరత్ అనే నేను' ఏదో మళ్ళీ ఫామ్ లోకి రావాలి అని కమర్షియల్ మీటర్స్ తీసుకుని చేసినట్లుగా అనిపించింది.

ఆ తర్వాత మహర్షి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సరిలేరు నీకెవ్వరు కూడా పూర్తిస్థాయిలో మెప్పించలేదు. సర్కారు వారి పాట కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇక ఇప్పుడు ఎలాగైనా మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న తన 28వ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక మొత్తానికి సినిమాను ఇటీవల ఒక యాక్షన్ ఎపిసోడ్ తోనే మొదలుపెట్టారు.

దర్శకుడు త్రివిక్రమ్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేయగలడు అని నమ్మవచ్చు. అయితే మహేష్ బాబు కెరీర్ లో ఎన్ని సినిమాలున్నా ఎన్ని బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అతన్ని ఇంతకుముందు రెండుసార్లు విభిన్నంగా చూపించింది మాత్రం త్రివిక్రమ్ అనే చెప్పాలి. SSMB 28లో సరికొత్త లుక్కుతో కనిపిస్తూ ఉండడంతో మళ్ళీ కొత్తగా అనిపిస్తోంది. మహేష్ బాబు తో ఇదివరకే రెండుసార్లు సినిమాలు చేసిన త్రివిక్రమ్ సరికొత్త బాడీ లాంగ్వేజ్ ను చూపించాడు.

అతడు సినిమాలో మహేష్ బాబు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అందులో నందగోపాల్ అలాగే పార్ధు పాత్రలో రెండు షేడ్స్ లో కూడా దాదాపు సీరియస్ గానే కనిపించాడు. హడావుడి లేకుండా  అందులోనే మహేష్ చూపించిన హావభావాలు సరికొత్తగా అనిపించాయి. అందుకు త్రివిక్రమ్ పాత్ర ఎంతో ఉంది. ఇక ఖలేజా సినిమాలో అయితే మహేష్ బాబులో అంత కామెడీ టైమింగ్ ఉందా అని కూడా అందరూ ఆశ్చర్యపోయేలా మహేష్ బాబును ప్రజెంట్ చేశాడు త్రివిక్రమ్.

ఇక ఇప్పుడు 28వ సినిమాలో యాక్షన్ ఎలెమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండే విధంగా పక్క ప్రణాళికతో మహేష్ బాబుకు సరికొత్త బాడీ లాంగ్వేజ్ ను సెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. లుక్కుతోనే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇక సినిమాలో మాత్రం తప్పకుండా సూపర్ స్టార్ ను సరి కొత్తగా ప్రజెంట్ చేస్తాడు అని చెప్పవచ్చు. మరి 2023 ఏప్రిల్ 28వ తేదీన రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • superstar 
  • maheshbabu 
  • maheshmovies 
  • SSMB28 
  • SSMB28shooting 
  • trivikram 
  • latestnews 

Similar News

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS