పిక్ టాక్: మాస్క్ గ్యాంగ్ తో మహేష్...!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం విహార యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలు పూర్తిగా ఇంటికే పరిమితమైన మహేష్.. ఇటీవల భార్యా పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లాడు. అక్కడ తన పిల్లలతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో మహేష్ సతీమణి నమ్రత సైతం ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. లేటెస్ట్ గా కోవిడ్ నేపథ్యంలో మాస్కులు ధరించిన ఓ పిక్ ని నమ్రత సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేసింది.
ఈ ఫొటోలో మహేష్ - నమ్రత తన ఫ్రెండ్స్ తో కలసి మాస్కులు ధరించి కనిపిస్తున్నారు. దీనికి నమ్రత 'ముసుగు ముఠా' అని క్యాప్షన్ పెట్టింది. ఇది బీచ్ కి దగ్గరలో తీసుకున్నదిగా నమ్రత పేర్కొంది. ఇందులో మాస్క్ పెట్టుకొని ఉన్న మహేష్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్క్ ఉండటం వల్ల మహేష్ ఫేస్ పూర్తిగా కనిపించకపోయినప్పటికీ.. అతని హెయిర్ స్టైల్.. ఛార్మింగ్ లుక్ ఫోటోకే అందాన్ని తెచ్చింది. ఇంతకుముందు మహేష్ కూడా పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేసిన ఫొటోను పంచుకున్నాడు. 'ముగింపు లేని నవ్వులు, సరదా, ప్రేమ.. నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. నా రెండు పిల్లర్స్ కు హ్యాపీ చిల్డ్రన్స్ డే' అని మహేష్ పేర్కొన్నాడు.