రాజమౌళికి మాత్రమే సాధ్యమంటున్న మహేష్

Update: 2016-05-24 07:30 GMT
ఈ రోజుల్లో మైథలాజికల్ సినిమాలు తీయాలంటే అది ఒక్క రాజమౌళికే సాధ్యమని అంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మీరు మైథలాజికల్ సినిమా చేస్తారా అని ఓ ఇంటర్వ్యూ లో మహేష్ ను అడిగితే.. తనకైతే ఆ ఉద్దేశం లేదన్నాడు. చేస్తే గీస్తే అది రాజమౌళి దర్శకత్వంలో మాత్రమే అని తేల్చేశాడు మహేష్. ‘‘మామూలుగా అయితే నాకు అలాంటి సినిమాలు చేసే ఉద్దేశాలేమీ లేవు. ఐతే రాజమౌళితో చేస్తే అలాంటివి చేస్తానేమో. ఆయన తప్ప అలాంటి సినిమాలు తీసేవాళ్లెవరూ నాకు కనిపించడం లేదు’’ అని మహేష్ అన్నాడు.

పూరి జగన్నాథ్ తన కెరీర్ ను మార్చేసిన దర్శకుడని చెప్పిన మహేష్.. ఆయన కేవలం అరగంట మాత్రమే తనకు ‘పోకిరి’ కథ చెప్పి ఒప్పించారన్నాడు. పోకిరి రోజుల్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు. రజినీకాంత్ తో కలిసి నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగితే.. ఆయన తనకు ఐకాన్ అని.. అలాంటి అవకాశం వస్తే దాన్నో గౌరవం లాగే భావిస్తానని మహేష్ చెప్పాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తావన ఆయన చాలా బిగ్ స్టార్ అని.. ‘పోకిరి’ సినిమా బాలీవుడ్లో ఆయనకు తప్ప ఇంకెవరికీ సూటయ్యేది కాదని చెప్పాడు.

1-100 మధ్య తనకు తాను రేటింగ్ ఇచ్చుకోవాల్సి వస్తే.. 100వ స్థానాన్ని ఎంచుకుంటానని చెప్పిన మహేష్.. తెర మీద ‘సూపర్ స్టార్ మహేష్’ అని వేయడం తనకు నచ్చదని చెప్పాడు. అభిమానుల కోసమని చెప్పి నిర్మాతలే అలా వేస్తుంటారన్నాడు. ఇప్పటికీ తాను ప్రతి సినిమానూ తొలి సినిమాలాగే భావించి భయం భయంగా సెట్లోకి అడుగుపెడుతుంటానని.. దర్శకుల్ని మెప్పించగలనో లేదో అని టెన్షన్ పడుతుంటానని మహేష్ చెప్పడం విశేషం.
Tags:    

Similar News