‘మహర్షి’ కాంబినేషన్ రిపీట్.. 2021లో మూవీ?
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో మొదలైన వీరి జర్నీ.. ఆ తర్వాత మరింత బలపడింది. వీరిద్దరి ఫ్రెండ్షిప్ కాస్తా.. ఫ్యామిలీ అనుబంధంగా మారింది. ఖాళీ టైంలో ఈ రెండు కుటుంబాలు కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం కూడా చేస్తున్నారు.
ఇలాంటి టైంలో వంశీతో మహేష్ మరోసినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే మహేష్ కు ఓ కథ వినిపించారు. అయితే.. ప్రిన్స్ మాత్రం ఆ కథనున రిజెక్ట్ చేశారట. దీంతో.. అందరూ షాక్ అయ్యారు. మరికొందరు మాత్రం ఈ నిర్ణయం ద్వారా ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ అన్న రీతిలో.. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే.. సినిమా సినిమాానే అనిపించాాడు మహేష్ అంటున్నారు.
దీంతో వంశీ పైడిపల్లి రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వినిపించాయి. అతని కోసం ఓ కథ సిద్ధం చేశాడని కూడా టాక్ వినిపించింది. అయితే.. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. కారణాలు ఏంటనేది తెలియలేదు కానీ, రామ్ చరణ్ తో వంశీ సినిమా లేదని తెలుస్తోంది. దీంతో మళ్లీ మహేష్ బాబు వైపు షిఫ్ట్ అయ్యాడట వంశీ.
ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కొనసాగిస్తూనే.. అతను తన నెక్స్ట్ మూవీ కోసం దర్శకులతో డిస్కస్ చేస్తున్నాడు ప్రిన్స్. కానీ.. ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదు. ఈ గ్యాప్ ను ఆక్యుపై చేసేందుకు ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్‌ను రాస్తున్నాడట వంశీ పైడిపల్లి. త్వరలోనే దాన్ని మహేష్ కు వినిపించబోతున్నాడట. అయితే.. ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తర్వాతే ప్రాజెక్టుకు ఓకే చెపుతాడట మహేష్. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే.. కొత్త సంవత్సరంలో సెకండ్ హాఫ్ లో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని టాక్. దిల్ రాజు, పివిపి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తారని తెలుస్తోంది.