ప్రభాస్‌ కు మహేష్‌ విషెష్‌.. చిన్న పొరపాటు

Update: 2020-10-23 11:30 GMT
ఈమద్య కాలంలో మహేష్ బాబు సోషల్‌ మీడియాలో స్టార్స్‌ అందరి పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. మహేష్‌ బాబు తో పాటు దాదాపు అందరు హీరోలు కూడా ఒకరి పుట్టిన రోజుకు మరొకరు స్పందించడం చాలా కామన్‌ అయ్యింది. నేడు ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్బంగా పదుల సంఖ్యలో ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా చాలా ఏళ్ల క్రితం ప్రభాస్‌ తో దిగిన ఒక ఫొటోను షేర్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. సిన సినీ కెరీర్‌ నీ భవిష్యత్తు అంతా బాగుండాలి అంటూ మహేష్‌ బాబు పేర్కొన్నాడు. అయితే ట్విట్టర్‌ లో విశెష్‌ చెప్పేప్పుడు చిన్న పొరపాటు జరిగింది.

సాదారణంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే సమయంలో వారి వారి ట్విట్టర్‌ హ్యాండిల్‌ ను ట్యాగ్‌ చేయడం కామన్‌ గా జరుగుతుంది. కాని ప్రభాస్‌ కు ట్విట్టర్‌ హ్యాండిల్‌ లేదనే విషయం తెల్సిందే. కాని మహేష్‌ బాబు పొరపాటను యాక్టర్‌ ప్రభాస్‌ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఉండగా దాన్ని ట్గాగ్‌ చేశాడు. అయితే విషయం తెలిసిన మహేష్‌ బాబు కొద్ది సమయానికే చాలా మంది చూశారు. వెంటనే మహేష్ బాబు పొరపాటు సరి చేసుకుని వెంటనే ఆ ట్యాగ్‌ తీసేశాడు. ఇన్‌ స్టాగ్రామ్‌ మరియు ఫేస్‌ బుక్‌ లో ప్రభాస్ కు అధికారిక అకౌంట్స్ ఉన్నాయి. కాని ట్విట్టర్‌ లో మాత్రం లేవు. ఇన్‌ స్టా లో షేర్‌ చేసి మహేష్‌ బాబు పేరును ట్యాగ్‌ చేసి శుభాకాంక్షలు తెలియజేశాడు.
Tags:    

Similar News