మహేష్ దంపతుల కొత్త సాంప్రదాయం
దీపావళి అంటే బహుమానాలు ఇచ్చి పుచ్చుకోవడం. తీపిని పంచుకుంటూ ఒకరిని ఒకరు సంతోషపర్చుకోవడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలో ఎంతో మంది తమ సన్నిహితులకు బహుమానాలు ఇస్తు ఉంటారు. ఈసారి మహేష్ బాబు దంపతులు ఇచ్చిన బహుమానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు స్టార్స్ టెక్నీషియన్స్ తమకు మహేష్ దంపతుల నుండి దీపావళి గిప్ట్ వచ్చిందని ఆనందంగా షేర్ చేసుకున్నారు. మహేష్ బాబు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇచ్చిన బహుమానాలను ఆనందంగా స్వీకరించడంతో పాటు వారికి దీపావళి శుభాకాంక్షలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పలువురు తమ ఫీలింగ్ ను షేర్ చేశారు.
మహేష్ దంపతుల బహుమానాలు అందుకున్న వారిలో గుణశేఖర్.. థమన్.. అడవి శేషు ఇంకా వరుణ్ తేజ్ తో పాటు పలువురు ఉన్నారు. వీరు సోషల్ మీడియా ద్వారా మహేష్ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. దీపావళి బహుమానాలు మరియు గ్రీటింగ్స్ ను మహేష్ దంపతులు పంపించడం కొత్త సాంప్రదాయంగా టాక్ నడుస్తోంది. మహేష్ దంపతులు మొదలు పెట్టిన ఈ కొత్త సాంప్రదాయంను అంతా అభినందిస్తున్నారు. ఇలాంటివి ముందు ముందు కూడా కొనసాగించాలని తమ తో వర్క్ చేసే వారి పట్ల అభిమానంను చూపించడం నిజంగా అభినందనీయం. సూపర్ స్టార్ కపుల్ కొత్త సాంప్రదాయం అందరికి ఆదర్శం అవ్వాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు.