‘మహర్షి’ స్క్రిప్ట్‌ గురించి మహేష్‌ రెస్పాన్స్‌

Update: 2019-01-01 12:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 25వ చిత్రంగా రూపొందుతున్న చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం దిల్‌ రాజు, అశ్వినీదత్‌, పీవీపీల బ్యానర్‌ ల్లో నిర్మాణం జరుగుతుంది. మహేష్‌ బాబు మునుపెన్నడు లేని విధంగా ఈ చిత్రంలో గడ్డం మీసాలతో కొన్ని సీన్స్‌ లలో కనిపించబోతున్నాడు. సినిమాలో అది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విభిన్నమైన అంశాలు, కొత్తదనంతో కూడిన విషయాలు ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే గత ఏడాది వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రంలోని భరత్‌ పాత్రకు, ‘మహర్షి’లోని రిషి పాత్రకు చాలా దగ్గర పోలికలు ఉంటాయనిపిస్తుంది. తాజాగా ఆ విషయమై మహేష్‌ బాబు స్పందిస్తూ... భరత్‌ కు రిషికి చాలా తేడా ఉంటుంది. రెండు వేరు వేరు రకాల పాత్రలు. భరత్‌ అనే నేను చిత్రం కథకు మహర్షి చిత్రం కథకు చాలా వైవిధ్యం ఉంటుంది. ‘మహర్షి’ చిత్రం చాలా గొప్ప స్క్రిప్ట్‌ అని, వంశీ పైడిపల్లిపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రంను చేస్తున్నట్లుగా మహేష్‌ బాబు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా చెప్పుకొచ్చాడు.

సమ్మర్‌ లో విడుదల కాబోతున్న ‘మహర్షి’ చిత్రం మహేష్‌ బాబు కెరీర్‌ లోనే మరో బ్లాక్‌ బాస్టర్‌ గా నిలవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో చెబుతున్నారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రం కథపై దాదాపుగా రెండు సంవత్సరాలు వర్క్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించబోతుండటం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తుంది. మహేష్‌ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం అవ్వడంతో ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.



Full View
Tags:    

Similar News