ఫ్లాప్ అయితే నా తప్పే -మహేష్ బాబు
సాధారణంగా స్టార్ హీరోలు.. మూవీ హిట్ అయితే ఆ క్రెడిట్ తాము తీసుకుని... ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీదకు నెట్టేస్తుంటారు. టాలీవుడ్ లో ఈ ధోరణి బాగా ఎక్కువ. స్టార్లకు ఫ్లాప్ మూవీలు ఇచ్చిన డైరెక్టర్లు.. నెక్స్ట్ ఛాన్సుల కోసం నానా పాట్లు పడ్డం ఇప్పటికీ జరుగుతోంది. కానీ ఈ విషయంలో మహేష్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తాను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఆ బాధ్యత తన ఒక్కడిదే అంటున్నాడు.
తన ఇమేజ్ కి తగినట్లుగా, ప్రేక్షకులు కోరుకునే విధంగా కథల్ని సరిగా జడ్జ్ చేయలేకపోవటం వల్లే... గతంలో కొన్ని ఫ్లాప్ లు వచ్చాయన్నాడు మహేష్. సినిమా ఫ్లాప్ అయితే తానే రెస్పాన్సిబుల్ అనీ.. అదే హిట్ అయితే అందరికీ క్రెడిట్ దక్కుతుందని చెప్తున్నాడు. గతంలో ఫ్లాప్స్ వచ్చినపుడు చాలా బాధపడ్డాడట. కొన్నిరోజులపాటు ఇంట్లోంచి బయటకు రాలేదని చెప్పాడు మహేష్.
ప్రేక్షకులకు కొత్తదన అందించేందుకే మల్టీస్టారర్ లకు సై అంటున్నట్లు చెబ్తున్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్, శ్రీనువైట్ల మంచి ఫ్రెండ్స్ అని.. వారి కోరిక మీదే ఇతర హీరోల చిత్రాలకు వాయిస్ ఇచ్చానన్న మహేష్... తాను ఇలాంటివి ఎంకరేజ్ చేస్తానని చెబ్తున్నాడు. బాహుబలి మూవీని మించి చేయాలన్న ఆలోచన కూడా తనకు లేదన్న మహేష్... కె.ఎల్. నారాయణ ప్రొడక్షన్ లో జక్కన్న మూవీ చేస్తానని, ఎప్పుడు ప్రారంభమవుతుందో మాత్రం చెప్పలేనన్నాడు మన శ్రీమంతుడు.