స్వగ్రామంలో కరోనా వాక్సిన్ పంపిణీ.. మనసులు గెలిచిన సూపర్ స్టార్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రీల్ హీరో మాత్రమే కాదు. అప్పుడప్పుడు ఆయనలోని రియల్ హీరో కూడా బయటికి వస్తుంటాడు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎవరి కుటుంబాలను వారు కాపాడుకోవడమే గగనం అయిపోయింది. కానీ సూపర్ స్టార్ మహేష్ వారి స్వగ్రామం అయినటువంటి బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే. ఆయన సినిమాలోని "ఊరు మనకు చాలా ఇచ్చింది తిరిగి ఊరికి మనం చాలా చేయాలి" అన్నట్లుగానే మహేష్ పంథా సాగిస్తున్నాడు. కరోనా కష్టకాలంలో తన ఊరుకు ఊరి జనాలకు కావాల్సిన అత్యవసరాలు ఏర్పాటు చేస్తున్నాడు.
మే 31న మహేష్ బాబు తండ్రి సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా వారి స్వగ్రామంలో మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మహేష్. తన గ్రామంలో కరోనా వ్యాధి సోకకుండా గ్రామ ప్రజలందరికి వ్యాక్సిన్ వేయించే కార్యక్రమానికి చేపట్టాడు. జనాలకు వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లు చేసి.. గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయలను అందిస్తున్నాడు. వారం రోజులపాటు కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాడు. బుర్రిపాలెం గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా.. అందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదు కాబట్టి రోజుకి రెండు వార్డుల చొప్పున మొత్తం ఆరో రోజుల్లో 12 వార్డుల ప్రజలకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
ఈ వ్యాక్సిన్ పంపిణీ సందర్బంగా మహేష్ సోషల్ మీడియాలో స్పందించి.. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్‌గా సేవలు అందిస్తున్న 'టీం మహేష్ బాబు' సభ్యులకు అలాగే 'ఆంధ్రా హాస్పటల్' వైద్యులకు ధన్యవాదాలు తెలియజేసాడు. ప్రస్తుతం మహేష్ పనికి ఫ్యాన్స్ తో పాటు నేటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఎవరైనా వారి సొంత గ్రామాల్లో ఏరియాల్లో వాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం మహేష్ బాబులాగే వేరే హీరోలు కూడా స్పందించి కరోనా ఫ్రీ కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు త్రివిక్రమ్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు.