అసెంబ్లీలో సీఎం మహేష్ బాబు

Update: 2017-06-21 08:23 GMT
మహేష్ బాబు అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. సీఎం సీట్లో కూచుంటున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి కాదులెండి. సినిమాలో భాగంగానే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ సెట్ వేశారు. అక్కడే మహేష్ సీఎంగా కనిపించే సీన్లను షూట్ చేస్తున్నారు.       

రీసెంట్ గా వచ్చిన అన్ని మూవీస్ లో మహేష్ లుక్ ఆల్ మోస్ట్ ఒకలానే ఉంటోంది. దాంతో సీఎంగా మహేష్ ఎలా ఉంటాడా అన్నదానిపై ఆసక్తి పెరిగింది. అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు డైరెక్టర్ శివ ఈ గెటప్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుకే షూటింగ్ స్పాట్ కు ఎవ్వరూ ఫోన్ తేవద్దని గట్టిగానే చెప్పాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను నవంబర్ లేదా డిసెంబర్ ఎండింగ్ కు పూర్తి చేసి సంక్రాంతి నాటికి థియేటర్లకు తేవాలని మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నారు.

భరత్ అనే నేను కన్నా ముందు తెలుగు, తమిళ భాషల్లో మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న స్పైడర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది. ఇంకా రెండు పాటలు మాత్రం పూర్తి చేయాల్సి ఉంది. ఈ పార్ట్ కూడా జులై ఆఖరు లేదా ఆగస్టు మొదటికి ఫినిష్ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత భరత్ అనే నేనుకు పూర్తి టైం కేటాయించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News