మ‌హేష్ న్యూ బ్రాండ్ పేరు ఇదే!

Update: 2019-07-29 09:01 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌రికొత్త‌ బిజినెస్ గోల్స్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోగా స‌త్తా చాటుతూనే మ‌రోవైపు థియేట‌ర్ - మ‌ల్టీప్లెక్స్ బిజినెస్.. ఇంకోవైపు వ‌స్త్ర శ్రేణి వ్యాపారం అంటూ చాలా పెద్ద ప్లాన్ తోనే ముందుకెళుతున్నాడు. ఇప్ప‌టికే సినిమాల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టి ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని వేగం పెంచారు. ఈ స్పీడ్ చూస్తుంటే కింగ్ నాగార్జున త‌ర‌హాలోనే సూపర్ స్టార్ మ‌హేష్‌ సైతం టాలీవుడ్ టాప్ ఎంట‌ర్ ప్రెన్యూర్స్ జాబితాలో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

తాజాగా మ‌హేష్ వ‌స్త్ర శ్రేణి వ్యాపారం ప్రారంభిస్తున్నార‌న్న వార్త‌లు ఫిలింస‌ర్కిల్స్ ని వేడెక్కిస్తోంది. మ‌హేష్ సొంతంగా ఓ డిజైన‌ర్ బ్రాండ్ ని ప్రారంభించి మార్కెట్లోకి దూసుకొస్తున్నార‌ని అందుకోసం వేరొక కంపెనీని టేకోవ‌ర్ చేశార‌ని అభిమానుల్లో ముచ్చ‌ట సాగింది. దీనిపై మ‌హేష్ మార్కెటింగ్ టీమ్ అధికారికంగానే వివ‌రాల్ని అందించింది. మ‌హేష్ ప్రారంభించే బ్రాండ్ పేరు `ది హంబుల్ డాట్ కో`. ఇక‌పై ఆ పేరుతో తెలుగు రాష్ట్రాలు స‌హా ప‌లు చోట్ల డిజైన‌ర్ డ్రెస్ ల అమ్మ‌కాలు సాగ‌నున్నాయి. ది హంబుల్ కోకి వెల్ కం అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తూ ఆగ‌స్టు 7న లాంచింగ్ ఉంటుంద‌ని వివ‌రాలు వెల్ల‌డించారు.

ఇక ఈ బ్రాండ్ కి సంబంధించి స్పాయిల్ అనే ఈకామ‌ర్స్ వెబ్ సైట్ ద్వారా విస్త్ర‌తంగా ప్ర‌చారం చేస్తారు. అలాగే ప‌లు వెబ్ సైట్ల ద్వారా మార్కెటింగ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. స్పాయిల్ అనేది మైంత్ర‌.. ఫ్లిప్ కార్ట్ త‌ర‌హాలోనే ఆన్ లైన్ దుస్తుల అమ్మ‌కంలో ఫేమ‌స్ ఈకామ‌ర్స్ వెబ్ సైట్. కాట‌న్ - డెనిమ్ డిజైన‌ర్ వ‌స్త్రాల రూప‌క‌ల్ప‌న‌లో ది బెస్ట్ డిజైన‌ర్ స్పెష‌లిస్టుల్ని మ‌హేష్ హంబుల్ టీమ్ రంగంలోకి దించుతున్నార‌ట‌. ఇప్ప‌టికే ఈ రంగంలో హృతిక్ రోష‌న్ .. విరాట్ కోహ్లీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి ప్ర‌ముఖ హీరోలు ఉన్నారు. ఇప్పుడు మ‌హేష్ రాక‌తో ఈ రంగానికి మ‌రింత గ్లామ‌ర్ పెరిగినట్టే.

    
    
    

Tags:    

Similar News