మహేశ్ కి సగం సక్సెస్ సాంగ్స్ తో వచ్చేలా ఉందే!
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు .. 14 రీల్స్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, మహేశ్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ కథ బ్యాంకు నేపథ్యంలో నడుస్తుంది. యాక్షన్ ను కలుపుతూ కావలసినంత కామెడీని అందించే సినిమా ఇది. దుబాయ్ .. గోవా .. స్పెయిన్ లలో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఛేజింగ్ సీన్స్ ను కూడా ఒక రేంజ్ లో చిత్రీకరించారు.
బలమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో పాట .. అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. ముందుగా వదిలిన ' కళావతి' .. ఆ తరువాత వదిలిన 'పెన్నీ' సాంగ్స్ రికార్డు స్థాయి వసూళ్లను సాధించాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'సరా సరా సరా సరా సర్కారువారి పాట' .. షురూ షురూ అన్నాడురా అల్లూరివారి బేట' అంటూ ఈ పాట సాగుతోంది.
తమన్ అందించిన బాణీకి .. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. హారిక నారాయణ్ ఆలపించిన ఈ పాట, హీరో స్టైల్ ను .. ఆయన రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనే విషయాలను ఆవిష్కరిస్తోంది. రివర్స్ లేని బాట .. వెపన్స్ లేని వేట అనే పద ప్రయోగాలు బాగున్నాయి. యూ ట్యూబ్ లో ఇంతవరకూ ఈ పాటకి 7.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమా నుంచి వస్తున్న పాటలు ఒక రేంజ్ లో పాప్యులర్ అవుతూ ఉండటం చూస్తుంటే, ఈ సినిమా సక్సెస్ లో సాంగ్స్ ప్రధానమైన పాత్రను పోషించనున్నాయని అనిపిస్తోంది.
ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన హెయిర్ స్టైల్ ను చాలా వరకూ మార్చారు. ఆయన సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. ఇక కీలకమైన పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడు. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు .. త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కథానాయియికగా పూజ హెగ్డే అలరించనుంది. 'మహర్షి' తరువాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది.