10 రోజుల ముందే మహేష్‌ మానియా మొదలు

Update: 2021-07-28 11:49 GMT
సూపర్ స్టార్‌ మహేష్ బాబు బర్త్‌ డే కు ఇంకా పది రోజుల సమయం ఉంది. మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా సర్కారు వారి పాట టీజర్ ను విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కాని తాజాగా మాత్రం సినిమా నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సమాచారం అందుతోంది. థమన్ సంగీతం అందిస్తున్న సర్కారు వారి పాట సినిమా లోని ప్రతి పాట కూడా చాలా బాగా వచ్చాయని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అల వైకుంఠపురంలో తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో సర్కారు వారి పాట లోని పాటలు ఉంటాయంటూ థమన్ అభిమానులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే సంగీత దర్శకుడు థమన్‌ వర్క్ చేసినట్లుగా ఆయన సోషల్‌ మీడియా పోస్ట్‌ లను చూస్తుంటే అర్థం అవుతుంది.

పాటల విషయంలో ఎక్కడ రాజీ లేకుండా మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గకుండా థమన్‌ అన్ని రకాల పాటలను సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే విధంగా ట్యూన్‌ చేశాడంటూ యూనిట్‌ సభ్యుల నుండి సమాచారం అందుతోంది. మహేష్‌ బాబు బర్త్ డే సందర్బంగా విడుదల కాబోతున్న మొదటి పాట గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌ బాబు పుట్టిన రోజుకు ఇంకా వారం సమయం ఉండగానే అప్పుడే అభిమానులు సోషల్‌ మీడియాలో మహేష్‌ మానియా బిగిన్స్ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు.

ఈ హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్ లో ట్రెండ్‌ అవ్వడంతో బర్త్‌ డే 10 రోజులు ఉండగానే సందడి మొదలు అయ్యింది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు సోషల్‌ మీడియాలో ఈసారి బర్త్‌ డే సందర్బంగా రికార్డ్‌ సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు. మహేష్‌ బాబు సర్కారు వారి పాట సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ ను సెప్టెంబర్‌ వరకు పూర్తి చేయాలనే పట్టుదలతో యూనిట్‌ సభ్యులు కంటిన్యూస్‌ గా షూటింగ్‌ చేయబోతున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ బాబు సినిమా చేయబోతున్నాడు.

చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబో మూవీ రాబోతున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి. ఆ సినిమా అప్ డేట్‌ ను మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఏమైనా రివీల్‌ చేస్తారా అంటూ కూడా ట్విట్టర్ లో మహేష్‌ మానియా బిగిన్స్ హ్యాష్‌ ట్యాగ్‌ షేర్‌ చేస్తూ చాలా మంది చర్చించుకున్నారు. మొత్తానికి బర్త్‌ డే పది రోజులు ఉండగానే ట్విట్టర్‌ లో తెగ సందడి చేశారు అభిమానులు. మహేష్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇటీవలే ఆమె కూడా మహేష్‌ బాబుతో జత కట్టింది. ఇద్దరి కాంబోలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Tags:    

Similar News