• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేజర్' విడుదల తేదీని...

మేజర్' విడుదల తేదీని ప్రకటించిన మహేష్..!

By - Tupaki Desk
Update: 2021-11-03 05:11 GMT
యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న బయోపిక్ ''మేజర్''. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'మేజర్' సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఆలస్యమైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ రెడీ అయ్యారు. దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్మాత సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

''మేజర్'' చిత్రాన్ని 2022 ఫిబ్రవరి 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మహేష్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. హీరో అడవి శేష్ ట్వీట్ చేస్తూ.. ఇది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం - ప్రేమ మరియు లెగసీ నుండి ప్రేరణ పొందిన భారీ చిత్రమని పేర్కొన్నారు. ఈ మూవీని తెలుగుతో పాటుగా మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అడివి శేష్ ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేయడమే కాకుండా.. కథ - స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. దీని కోసం స్వయంగా ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులను కలిసి, వారి అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే విడుదలైన 'మేజర్' ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇది శేష్ కెరీర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

'మేజర్' చిత్రాన్ని GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల - బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి సంభాషణలు రాస్తున్నారు.


Tags:    
  • Major 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

పవన్ కళ్యాణ్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చిన జనసేన!

2026-11-10 09:55 GMT

బిజినెస్ ఉమెన్ గా తొలి దీపావళి.. తమన్నా అవుట్ ఫిట్ ఖరీదు ఎంత అంటే

2026-11-10 09:39 GMT

ఆ విషయంలో యష్ జాగ్రత్త పడాల్సిందే..!

2026-11-10 09:38 GMT

టాలీవుడ్ పై కన్నేసిన మలయాళ బ్యూటీ!

2026-11-10 08:30 GMT

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS