ఔను మేము విడిపోయాం అంటూ బిబి స్టార్‌ క్లారిటీ ఇచ్చింది

Update: 2021-05-06 12:30 GMT
బాలీవుడ్‌ సెలబ్రెటీల ప్రేమ.. బ్రేకప్‌ అనేది చాలా కామన్‌. తాజాగా మరో సెలబ్రెటీ కపుల్‌ కూడా విడిపోయారు. నయీ పడోసన్‌ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మహేక్‌ చాహల్‌ ఆ తర్వాత పలు సినిమా ల్లో నటించింది. సల్మాన్ ఖాన్‌ తో వాంటెడ్ సినిమా లో కూడా కనిపించింది. బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు హిందీ బిగ్ బాస్ సీజన్‌ 5 లో సందడి చేసింది. ఈమె బిగ్ బాస్ తర్వాత మరింతగా బిజీ అయ్యింది. బిగ్‌ బాస్ తో సల్మాన్‌ వంటి స్టార్ తో నటించే అవకాశం దక్కించుకుంది. ఈమె గత కొంత కాలంగా అస్మిత్ పటేల్‌ తో ప్రేమలో ఉంది.

ఇటీవలే అస్మిత్ పటేల్ తో ఈమె బ్రేకప్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. మహేక్‌ చాహల్ లు మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్తలు నిజమే. మేము మా బంధానికి ముగింపు పలికాము. ఒక వ్యక్తితో ఎక్కువ సమయం గడిపినప్పుడు.. ఎక్కువ సమయం అతడితో మాట్లాడితే అప్పుడు ఆ వ్యక్తి అసలు స్వరూపం తెలుస్తుంది. అతడితో నేను గడిపిన సమయం నాకు ఏమాత్రం సంతోషంను కలిగించలేదు. అస్మిత్ నాకు సరైనోడు కాదు అని తేలిపోయింది.

అస్మిత్‌ నాకు సరైన జోడీ కాదని చాలా తక్కువ సమయంలోనే తేలిపోయింది. అతడితో బ్రేకప్‌ అయిన సమయంలో నేను చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నాకు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. ఒక ఏడాది పాటు గోవాలో ఉండి ఆ డిప్రెషన్‌ నుండి బయట పడ్డట్లుగా చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కుటుంబ వారు సహకారం వల్లే నేను బయట పడ్డట్లుగా చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News