మ‌హ‌ర్షి థీమ్ బుక్.. అందులో ఏం ఉందో?

Update: 2019-08-02 08:13 GMT
స‌మాజం కోసం ఒక మంచి చేయాల‌ని సినిమా తీయ‌డం ఒక ప‌ద్ధ‌తి. లేదు డ‌బ్బు మాత్ర‌మే కావాలనే ల‌క్ష్యంతో క‌మ‌ర్షియ‌ల్ గా సినిమా తీయ‌డం వేరొక ప‌ద్ధ‌తి. ఈ రెండిటినీ మిక్స్ చేసి చేసిన ప్ర‌య‌త్న‌మే `మ‌హ‌ర్షి`. రైతు క‌ష్టాలు వ్య‌వ‌సాయంపై సినిమా తీయాల‌నే సాహ‌సం మ‌హ‌ర్షి చిత్రంతో మ‌హేష్‌- వంశీ పైడిప‌ల్లి- దిల్ రాజు బృందం చేయ‌డాన్ని ప‌రిశ్ర‌మ యావ‌త్తూ ప్ర‌శంసించింది. ప్రేక్ష‌కులు మెచ్చారు.  క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కినా ఈ సినిమా లాంగ్ ర‌న్ లోనే మ‌నీ ఎర్నింగ్ ప‌రంగా సేవ్ అయ్యింద‌ని చెప్పుకున్నారు. ఏదైతేనేం ఆ సినిమాకి క‌నెక్ట‌య్యి కొంద‌రు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం వ్య‌వ‌సాయం చేస్తామంటూ పొలాల్లోకి దిగిన వీడియోలు అంతే వైర‌ల్ గా మారాయి.

అందుకే మ‌హ‌ర్షి క‌థ‌నే థీమ్ గా ఎంచుకుని రైతు గోడును వివ‌రిస్తూ ఓ పుస్త‌కం రాశారు ఓ ర‌చ‌యిత ఐఏఎస్ అధికారి. పుస్త‌కం టైటిల్ `సెల్ఫీ ఆఫ్ స‌క్సెస్‌`. టైటిల్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దీనికి సూప‌ర్ స్టార్ మ‌హేష్ స్వ‌యంగా ప్ర‌చారం చేస్తుండ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రం. ``ఏదో ఒక ర‌కంగా మ‌న‌కు స‌క్సెస్ వ‌స్తుంది. సెల్ఫీ ఆఫ్ స‌క్సెస్ పుస్త‌కంలో `స‌క్సెస్` తాలూకా అందాన్ని ఎంతో చ‌క్క‌గా చెప్పారు. మిమ్మ‌ల్ని మెరుగుప‌రుచుకునే ఇంధ‌నంగా ఇది ప‌నికొస్తుంది. స‌క్సెస్ అనేది ముగింపు కాదు.. అదొక ప్ర‌యాణం అనేది మ‌హ‌ర్షి సినిమా ఆత్మ‌. మ‌హ‌ర్షి థీమ్ తోనే రూపొందించిన ఈ పుస్త‌కంలో ఎన్నో కామ‌న్ ఎలిమెంట్స్ క‌నిపిస్తాయి. ర‌చ‌యిత శ్రీ బుర్రా వెంక‌టేశమ్ కి ధన్య‌వాదాలు. మ‌హ‌ర్షి ఎడిష‌న్ అమెజాన్ బెస్ట్ సెల్ల‌ర్ గా నిలిచింది. ఈ పుస్త‌కం చ‌ద‌వండి. మీ ఆప్తుల‌కు కానుక‌గా ఇచ్చి చ‌దివించండి`` అని ఫేస్ బుక్ లో కోరారు మ‌హేష్.

దీనికి అభిమానుల నుంచి స్పంద‌న బావుంది. మీ ఆలోచ‌న‌లు ప్రోత్సాహ‌క‌రం. సమాజానికి ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న‌ల‌తో సినిమాలు చేయ‌డం అభినంద‌నీయం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ పుస్త‌కం చ‌దువుతామ‌ని అన్నారు కొంద‌రు అభిమానులు.


Tags:    

Similar News