• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇది నరేష్ గర్వపడే...

ఇది నరేష్ గర్వపడే విజయమేనా

By - Tupaki Desk
Update: 2019-05-13 14:30 GMT
మహర్షి ఏ రేంజ్ సక్సెస్ మహేష్ అన్నట్టు ఇది కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించబోయే మూవీగా నిలుస్తుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం రావడానికి ఇంకో పది రోజులైనా ఆగాలి. అప్పుడు కాని సరైన ఫిగర్స్ తో ఓ కంక్లూజన్ కు రాలేం. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో యూనిట్ లో ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయిపోయి సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్పేసుకున్నారు కాని మొదటి నాలుగు రోజుల వసూళ్ళను బట్టి స్టార్ హీరో మూవీ ఫేట్ ని డిసైడ్ చేయడం తొందరపాటుతనమే అవుతుంది.

ఇదిలా ఉండగా అల్లరి నరేష్ నాలుగేళ్ల తర్వాత హిట్ అనే మాట వింటున్నానని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు. సక్సెస్ కోసం నరేష్ ఎంతగా తపించిపోతున్నాడో దాన్నిబట్టే అర్థమైపోయింది. కాని మహర్షిలో నరేష్ చేసిన రవి పాత్ర అతనికి బంగారు భవిష్యత్తు ఇస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఎందుకంటే మహర్షి పూర్తిగా మహేష్ వన్ మ్యాన్ షో. కథలో ఎంత కీలకమైన పాత్ర చేసినా అందులో అల్లరి నరేష్ చాలా పరిమితుల మధ్య నటించాడు. కామెడీకి కాని తనవరకు ఉన్న ఇమేజ్ పరంగా ఏదైనా హీరోయిజం కాని చూపించే ఛాన్స్ దక్కలేదు. కేవలం సానుభూతి మీదే అది చివరి దాకా నడుస్తుంది.

బయటకి వచ్చాక ఓ పది శాతం మన మదిలో నరేష్ మెదిలినా మిగిలిన తొంభై శాతం స్పేస్ తీసుకుంది మహేశే. సో అల్లరి నరేష్ కు సోలో హీరోగా సాలిడ్ హిట్ పడే దాకా ఇంకా వేచి చూడాల్సిందే. అది బంగారు బుల్లోడుతో తీరుతుందనే నమ్మకంతో ఉన్నాడు అల్లరోడు. అది గట్టిగా హిట్టు కొడితే ఓకే. లేదంటే కథ మళ్ళి మొదటికే వస్తుంది. ప్రతిసారి రవి లాంటి క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఉండలేడు కదా. హీరోగా యాభై సినిమాలు చేసిన నరేష్ కు ఇలాంటి ఛాలెంజ్ ఎదురుకోవాల్సి రావడం వింతే
    

Tags:    
  • Maharshi 
  • Allari Naresh 
  • Telugu News 
  • Latest updates 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS