సూర్య‌కు మ‌ద్రాస్ హైకోర్టు షాక్.. ప‌న్ను మొత్తం క‌ట్టాల్సిందే!

Update: 2021-08-18 07:30 GMT
కోలీవుడ్ హీరోల‌కు మ‌ద్రాస్ హైకోర్టు షాక్ ల మీద షాకులిస్తున్న సంగ‌తి తెలిసిందే. కారు ప‌న్నులు.. ఆస్తుల ప‌న్నుల మిన‌హాయింపు విష‌యంలో హీరోలు వేసిన పిటీష‌న్లను కొట్టేస్తూ ఊహించ‌ని షాక్ లిస్తుంది. ఇప్ప‌టికే విజ‌య్..ధ‌నుష్ లకు ఆ ర‌కంగా గ‌ట్టి షాక్ త‌గిలింది. విదేశాల నుంచి దిగుమ‌తి చేసిన ల‌గ్జ‌రీ కార్ల విష‌యంలో భార‌త్ లో ప‌న్ను మిన‌హాయింపులు ఇవ్వాల‌ని మ‌ద్రాసు హైకోర్టును ఈ ఇద్ద‌రు హీరోలు ఆశ్రయించ‌గా వాళ్ల అభ్య‌ర్ధ‌న‌ను కోర్టు తొసిపుచ్చింది. కొత్త కారు కోనుగోలు విషయంలో మొత్తం ప‌న్నును ప్ర‌భుత్వానికి చెల్లించాల్సింద‌న‌ని తుది తీర్పును వెలువ‌రించింది. దీంతో హీరోలు ప‌న్ను క‌ట్ట‌క త‌ప్ప‌లేదు.

తాజాగా ఆ వ‌రుస‌లో మ‌రో హీరో సూర్య కూడా నిలిచారు. అయితే సూర్య ప‌న్ను మిన‌హాయింపు వ్య‌వ‌హారం కారు విష‌యంలో కాదు.. ఆస్తుల‌కు సంబంధించిన‌ది. 2010 ఆదాయ‌పు ప‌న్ను శాఖ సూర్య ఆస్తుల‌పై రైడ్ లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇళ్లు.. ఆఫీసుల్లో సోదాలు నిర్వ‌హించి 2007-08.... 2008-09 సంవ‌త్స‌రాల‌కు గాను మొత్తం 3.11 కోట్ల‌ను చెల్లించాల్సిందిగా ఐటీ శాఖ సూర్య‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీస్ పై అప్ప‌ట్లో సూర్య ఐటీశాఖ ట్రిబ్యూన‌ల్ ని ఆశ్ర‌యించారు. కానీ ఈ కేసును ట్రిబ్యూన‌ల్ కూడా ప‌క్క‌న పెట్టింది. ఆ త‌ర్వాత 2018లో సూర్య హైకోర్టుని ఆశ్ర‌యించారు.

ఆ కేసు విచార‌ణ మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చింది. సూర్య త‌రుపు న్యాయ‌వాది ఐటీ శాఖ‌ ఆల‌స్యం చేసిందని.. ఆ కార‌ణంగా ఐటీకి చెల్లించాల్సిన వ‌డ్డ‌నీ నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోర్టుని కోరారు. అయితే ఈ వ్య‌వ‌హారంలో సూర్య ఐటీ శాఖ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని.. అందువ‌ల్లే ఆల‌స్యం జ‌రిగింద‌ని ఐటీ కౌన్సిల్ కోర్టుకి తెలిపింది. రెండు వాద‌న‌లు విన్న త‌ర్వాత మ‌ద్రాస్ హైకోర్టు సూర్య‌కి వ‌డ్డీ మిన‌హాయింపు అర్హ‌త లేద‌ని.. వ‌డ్డీ స‌హా మొత్తం చెల్లించాల్సిందేన‌ని కోర్టు తీర్పునిచ్చి సూర్య పిటీష‌న‌న్ ని కొట్టేసింది. తాజా తీర్పుతో ఆస్తుల వ్య‌వ‌హారంలో ఎవ‌రినీ కోర్టులు విడిచిపెట్ట‌వ‌ని ప్రూవైంది.




Tags:    

Similar News