మాస్క్ ముసుగులో పెళ్లిళ్ళా...? ఆగలేకపోతున్నారా...?
రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'నచ్చావులే' సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది తెలుగమ్మాయి మాధవీలత. ఆ తర్వాత 'స్నేహితుడు' 'అరవింద్ 2' లాంటి అడపాదడపా సినిమాల్లో నటించింది. ఈ భామ సినిమాల ద్వారా ఫేమస్ అయింది తక్కువే అయినా.. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చింది. ఇటీవల బీజేపీలో చేరిన ఆమె అధికార పార్టీపై కూడా పలు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాధవీలత మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి లాక్ డౌన్ లో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీల మీద కామెంట్స్ చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ - పల్లవి వర్మల పెళ్లి ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో కొద్దిమంది అతిథుల మధ్య నిరాడంబరంగా జరిగింది. లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఈ జంట సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇటీవల టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా ఇదే పద్దతిలో రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిపై ఈ మాజీ హీరోయిన్ బీజేపీ నేత మాధవీలత సోషల్ మీడియా వేదికగా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది.
''అసలు ఆగట్లేదుగా జనాలు.. మాస్క్‌లు వేసుకుని పెళ్లిళ్లు ఎందుకు? ముహూర్తం మళ్లీ రాదా? ఇది పోతే శ్రావణం.. అదీ పోతే మాఘమాసం.. లేకుండా మరో సంవత్సరం తరువాత ముహూర్తం వస్తుంది కదా.. ఏ పెళ్లి పిల్ల దొరకదా.. లేకుండా పిల్లోడు మారిపోతాడా?? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా? కొన్నాళ్లు ఆగలేని వాళ్లు సంసారాలు చేస్తారా?? ఫిక్స్ అయిన మ్యారేజ్ లో గ్యాప్ వస్తే.. నిజాలు తెలిసి బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా అంటే.. ఈ పెళ్లి ఏంటో.. నాకు అర్థం కావడం లేదు'' అంటూ నిఖిల్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. ''నా పోస్ట్ నా ఇష్టం.. నా ఒపీనియన్ నేను చెప్తా.. నాకు ఆ హక్కు ఉంది'' అంటూ పోస్ట్ పెట్టింది మాధవీలత. దీనిపై నెటిజన్లు 'హీరో నిఖిల్ పెళ్లి గురించేనా' అంటూ ప్రశ్నించగా.. దానికి 'ఏమో' అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే ఆమె పై కొందరు నెటిజన్స్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.