ఆ న‌టుడి వ్యాఖ్య‌లు పెద్ద త‌ప్పు అన్న `మా` అధ్య‌క్షుడు

Update: 2020-12-14 07:39 GMT
కన్నడ లెజెండ‌రీ క‌థానాయ‌కుడు విష్ణువర్ధన్ ‌పై తెలుగు నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నటుడు నరేష్‌ తీవ్రంగా ఖండించారు. కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్ప‌డ‌మే గాక‌..  లెజెండరీని దూషించడం అసభ్యపదజాలం వాడటం సరికాదని పేర్కొన్నారు.

క‌న్న‌డిగుల ఆరాధ్య దైవాన్ని మ‌న న‌టుడు రంగ‌రాజు అవ‌మానించారు. అన‌కూడ‌ని మాట‌ల‌న్నారు. ఏక‌వ‌చ‌నంతో తూల‌నాడారు. న‌టుడిగా న‌న్ను ఇది ఎంతో బాధించింద‌ని న‌రేష్ అన్నారు. కోట్లాది ప్రజల అభిమానం పొందిన ఓ కళాకారుడి గురించి అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలా జరిగినందుకు బాధపడుతున్నా. ఇవి విజయ రంగరాజు వ్యక్తిగత ఆలోచనలు అయినా మాట్లాడిన తీరు చాలా తప్పు అని అన్నారు. చిన్న త‌నం నుంచి విష్ణువ‌ర్దన్ ని చూస్తూ పెరిగామ‌ని న‌రేష్ వెల్ల‌డించారు.

విష్ణు వ‌ర్ధ‌న్ సాటి నాయిక‌ల‌తో స‌రిగా ప్ర‌వ‌ర్తించేవారు కాద‌న్న రంగ‌రాజు వ్యాఖ్య‌ల‌కు క‌న్న‌డిగుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. హీరోలు యశ్‌- సుదీప్‌- పునీత్‌ రాజ్‌కుమార్‌.. న‌టి సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు ఫైర‌య్యారు. దీంతో విష్ణువర్థ‌న్ కుటుంబం స‌హా అభిమానులు క్ష‌మించాల్సిందిగా మోకాళ్ల‌పై క్ష‌మాప‌ణ‌లు కోరారు.
Tags:    

Similar News