2.0: సగం అడ్వాన్సు వెనక్కి?

Update: 2018-07-21 10:53 GMT
సినిమా బిజినెస్ ను చాలామంది లాటరీ బిజినెస్ తో పోలుస్తారు.. కాస్త అతిశయోక్తిగా అనిపిస్తుందిగానీ లాజికల్ గా ఆలోచిస్తే నిజమేగా అని అనిపించకమానదు. ఎందుకంటే 10% సక్సెస్ రేట్ ఉన్న వ్యాపారంలో ఫ్లాపయ్యే మిగతా 90% సినిమాలపైన పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి గురించి ఆలోచిస్తే ఎవరికైనా షాక్ తగులుతుందని చెప్పక తప్పదు.  అందుకే డిస్ట్రిబ్యూటర్లు చాలా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. భారీ బడ్జెట్ సినిమాలపై పెట్టుబడి విషయంలో వాళ్ళు మరింతగా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.   ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ ఈమధ్య అలాంటి పరిస్థితే ఎదురైందట.

సునీల్ అయన స్నేహితులు కలిసి '2.0' సినిమా తెలుగు వెర్షన్ హక్కులను  దాదాపు 78 కోట్ల రూపాయలకు కొనేలా చాలా నెలల క్రితం ఒప్పందం చేసుకున్నారట.  అందులో 20 కోట్లు అడ్వాన్సు కుడా చెల్లించారట.  కానీ సినిమా ఎంతకీ విడుదల కాకపోవడంతో 'కాలా' రిలీజ్ సమయంలో ఓ 10 కోట్లు వెనక్కివ్వమని అడిగాడట. వాళ్లు సునీల్ అడిగినట్టుగా అడ్వాన్సులో సగం వెనక్కి ఇచ్చినట్టు ఫిలిం నగర్ సమాచారం.  మిగతా 10 కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారని, కాకపోతే సినిమా రిలీజ్ డేట్ నవంబర్ 29 అని ఈమధ్యే ప్రకటించడంతో సునీల్ వద్దన్నాడట.  

ఒకవేళ మొత్తం అడ్వాన్సు వెనక్కి తీసుకుంటే '2.0' రైట్స్ కోసం మరో టాప్ డిస్ట్రిబ్యూటర్ రెడీగా ఉన్నాడట. కానీ  సినిమా చాలా క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో సునీల్ కు మాత్రం '2.0' డీల్ వదులుకోవడం ఇష్టం లేదట.  ఒక్క సారి టీజర్ - ట్రైలర్ లు రిలీజ్ అయితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, రజిని- శంకర్ క్రేజ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయని నమ్మకంగా ఉన్నాడట.  చూద్దాం మరి ఏం జరుగుతుందో..!
Tags:    

Similar News