#అఖిల్ 5 కోసం అప్పుడే క‌థానాయిక ఫైన‌ల్

Update: 2020-10-13 04:45 GMT
అఖిల్ అక్కినేని స‌వారీ గురించి తెలిసిన‌దే. ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ` చిత్రంలో న‌టిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ ‌గా న‌టిస్తున్న ఈ మూవీతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ గ్యాప్ త‌ర్వాత‌ మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నాడు. అల్లు అర‌వింద్ నిర్మాణ  ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అయినా అఖిల్ కి హిట్ రావాల‌ని మెగా క్యాంప్ లో చేస్తున్న ఈ మూవీపై నాగ్ భారీ ఆశ‌లే పెట్టుకున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లై తిరిగి మొద‌లైంది. లాక్ డౌన్ డిలేను క‌వ‌ర్ చేస్తూ ఫాస్ట్ గా షూట్ చేసి చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత వెంట‌నే అఖిల్ ఓ స్పైథ్రిల్ల‌ర్ (అఖిల్ 5) ని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో హాలీవుడ్ స్టంట్ మెన్ ‌ల‌తో ఈ చిత్రాన్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై నిర్మించ‌నున్న ఈ మూవీ లో అఖిల్ కి జోడీగా క్రేజీ హీరోయిన్ ‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఆమే ర‌ష్మిక మంద‌న్న‌ని చిత్ర బృందం ఇటీవ‌ల సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. ర‌ష్మిక అయితే సినిమాకి మ‌రింత క్రేజ్ పెరుగుతుంద‌ని భావించి ఆమెని హీరోయిన్ గా ఫిక్స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ర‌ష్మిక ప్ర‌స్తుతం బ‌న్నీతో క‌లిసి `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది.
Tags:    

Similar News