• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #లూసీఫ‌ర్‌.. వినాయ‌క్ ని...

#లూసీఫ‌ర్‌.. వినాయ‌క్ ని కాద‌ని `త‌ని ఒరు‌వ‌న్` ద‌ర్శ‌కుడికే ఛాన్స్‌

By - Tupaki Desk
Update: 2020-12-16 13:23 GMT
సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `లూసీఫర్` తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి స‌ర్వ‌స‌న్నాహ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఆచార్య` చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే 153 వ సినిమాగా రానున్న ఈ మూవీ స్క్రిప్టును ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. నిజానికి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సిన ఈ మూవీకి మోహ‌న్ రాజాను ఫైన‌ల్ చేస్తూ చిరు అధికారికంగా ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

జనవరి 2021 సంక్రాంతి త‌ర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈసినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ``లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యింది. `త‌నిఒరువ‌న్` (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. రీమేక్ క‌థ ఓకే అయ్యింది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత సెట్స్ కెళ‌తాం. ఫిబ్ర‌వ‌రి-మార్చి - ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉంది`` అని తెలిపారు.

``మెగాస్టార్ చిరంజీవి గారు న‌టించిన హిట్ల‌ర్ (ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌కుడు‌) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాను. ఇప్పుడు ఆయ‌న‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం అదృష్ఠం ద‌క్క‌డం పూర్వ‌జ‌న్మ సుకృతం. ఈ అవ‌కాశం ద‌క్కినందుకు ఆనందంగా ఉంది. ఎన్వీ ప్ర‌సాద్ గారు నిర్మాత‌గా రాజీ లేకుండా తెర‌కెక్కించ‌నున్నారు`` అని మోహ‌న్ రాజా తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అండ్ ఎన్.వి. ప్ర‌సాద్ (ఎన్ .వి.ఆర్ సినిమా) సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా గురించి నిర్మాత ఎన్.వి. ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ``చిరంజీవి గారి సినిమాని మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌డం చాలా సంతోషంగా ఉంద``‌ని తెలిపారు.
Tags:    
  • Chiranjeevi 
  • Lucifer remake 
  • Director 
  • Mohan Raja 

Similar News

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Copyright @2026

Powered by Blink CMS