• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా భ‌క్తుడు ఈ డేగ‌ల...

మెగా భ‌క్తుడు ఈ డేగ‌ల బాబ్జి క‌థేమిటో గానీ!

By - Tupaki Desk
Update: 2021-09-20 17:30 GMT
మెగా ఫ్యామిలీపై బండ్ల గ‌ణేష్ అలియాస్ బ్లాక్ బ‌స్ట‌ర్ గ‌ణేష్ ఎంత‌గా ప్రేమ‌ను కురిపిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మెగాస్టార్ చిరంజీవి .. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు దైవాలు అని ఆయ‌న ప్ర‌తిసారీ భ‌క్తిభావం క‌న‌బ‌రుస్తారు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అయినా.. బండ్ల‌కు అభిమానం. మెగా బ్ర‌ద‌ర్స్ పై బండ్ల మాట‌ల్లో ప్రేమ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఆ మాట‌లు పెదాల నుంచి వ‌చ్చేవి కాదు.. మ‌న‌సులోంచి వ‌చ్చేవి! అంటూ గ‌ణేష్ త‌న‌దైన శైలిలో మ‌ధ్య మ‌ధ్య‌లో పంచ్ లేస్తూ ప్రేమ‌ను కురిపించడం ఆయ‌న‌కే చెల్లింది. ఇక ప‌వ‌న్ ని అయితే నా దేవుడు... నా శివుడు! అంటూ ఎన్నోసార్లు .. ఎన్నో వేదిక‌ల‌పై చెల‌రేగిపోయారు.

టాలీవుడ్ సినీ నిర్మాత‌ల్లో మెగా ఫ్యామిలీపై ఇంత‌గా అభిమానం చూపించే నిర్మాత‌ను ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ చూసి ఉండ‌క‌పోవ‌చ్చు కూడా. అందుకే గ‌ణేష్ వేడుక‌లో ఉంటే ఓ వైబ్రేష‌న్ అంటూ మెగా ఫ్యామిలీ స‌భ్యులు చెబుతుంటారు. తాజాగా మ‌రోసారి బాస్ చిరంజీవిపై ఓ రేంజులో స్పందించారు. నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన `ల‌వ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిధిగా విచ్చేసిన మెగాస్టార్ ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్పందించాల‌ని.. కొన్ని ర‌కాల వెసులు బాట్లు క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ బండ్ల మెగాస్టార్ పై త‌న‌దైన శైలిలో ట్విట‌ర్లో స్పందించారు.

మిమ్మ‌ల్ని చూస్తుంటే మీరు ముందు పుట్టి.. సంస్కారం త‌ర్వాత పుట్టినంత ఆనందంగా ఉంది సార్!! అంటూ దండం పెడుతోన్న ఎమోజీల‌ను పోస్ట్ చేసారు. ఆ సందేశానికి మెగాస్టార్ లైవ్ ఫోటోని జోడించి త‌న అభిమానాన్ని చాట్టుకున్నారు. బండ్ల చేసిన ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మెగాభిమానులు కూడా త‌మ‌దైన శైలిలో గ‌ణేష్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం గ‌ణేష్ హీరోగా ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వెంక‌ట్ చంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడు గ‌ణేష్ హీరోగా న‌టించాల‌ని ప‌ట్టుబ‌ట్టి అత‌న్ని ఒప్పించి `డేగ‌ల బాబ్జి` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అందుకు గాను గ‌ణేష్ కు పారితోషికం కూడా బాగానే చెల్లిస్తున్నారు.

మా అసోసియేష‌న్ కి మెంట‌లెక్కిస్తున్నాడు!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక ల్లో బండ్ల హంగామా గురించి తెలిసిందే. ఈసారి పోటీ ప్ర‌కాష్ రాజ్..మంచు విష్ణు ప్యాన‌ల్ మ‌ధ్య‌నే సాగ‌నుండ‌గా.. న‌టుడు బండ్ల గ‌ణేష్ ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ నుంచి త‌ప్పుకుని స్వ‌తంత్రంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. దీంతో సీన్ మ‌రింత వేడెక్కింది. ప్ర‌కాష్ రాజ్ టార్గెట్ గా బండ్ల గ‌ణేష్ చేస్తోన్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి మందు పార్టీలు..విందు పార్టీలు మంచిదేన‌ని ప్ర‌కాష్ రాజ్ బాహాటంగానే ప్ర‌క‌టించ‌గా బండ్ల దానిపై కౌంట‌ర్లు వేశారు. ప్ర‌కాష్ రాజ్ కూడా డిన్న‌ర్ పార్టీలు ఏర్పాటు చేయ‌గా బండ్ల పంచ్ లు విసిరారు. `ఓటు కావాలంటే అసోసియేష‌న్ కోసం పోటీదారులు ఏం చేస్తారో చెప్పి ఓటు వేయించుకోండి. వాళ్ల మ‌న‌సులు గెలుచుకోండి. అంతేగానీ విందులు పార్టీలంటూ కొత్త పుంత‌లు తొక్కి మెంబ‌ర్ల‌ని త‌ప్పు దారి ప‌ట్టించ‌వ‌ద్దు. క‌రోనా వేళ `మా `మెంబ‌ర్ల ఆరోగ్యాల‌తో చెల‌గాట‌మాడొద్దంటూ` త‌న‌దైన శైలిలో స్పందించారు బండ్ల‌.

అత్త మీద కోపం దుత్త‌పై..!

బండ్ల వాల‌కం అత్త మీద కోపం దుత్త‌పై చూపించిన చందంగానూ మారింద‌ని గుసగుస‌లు వినిపించాయి. త‌న‌ను కాద‌ని ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ లో కి జీవిత‌ను ప్ర‌వేశ పెట్ట‌డంపై బండ్ల ఇప్ప‌టికీ ప్ర‌కాష్ రాజ్ పై మ‌రిగిపోతున్నాడు. నిజానికి తన‌కు ప‌ద‌వి ముఖ్యం కాదు. ప‌రువు మ‌ర్యాద ముఖ్యం. తాను దైవాలుగా భావించే మెగాస్టార్ చిరంజీవి.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను కించ‌ప‌రుస్తూ జీవిత రాజ‌శేఖ‌ర్ దునుమాడిన వీడియోల్ని సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసి మ‌రీ ర‌చ్చ చేసిన బండ్ల ఇప్పుడు వార్ డైరెక్ట్ గానే న‌డిపిస్తున్నాడు. తాను జీవిత‌కు వ్య‌తిరేకంగా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా పోటీ చేయ‌డానికి కార‌ణం కూడా ఇదేన‌ని చానెల్ లైవ్ లో బాహాటంగా ప్ర‌క‌టించారు. మెగా వ్య‌తిరేకుల‌ను వ‌దిలేందుకు అత‌డు అంగీక‌రించ‌డం లేదు. ఆస‌క్తిక‌రంగా ఓ టీవీ చాన‌ల్ లైవ్ లో మాత్రం ప్ర‌కాష్ రాజ్ అధ్య‌క్షుడ‌వ్వాల‌ని బండ్ల అన‌డం .. ఆ త‌ర్వాత బండ్ల స్వ‌తంత్రుడిగా పోటీకి దిగ‌డం త‌న ఇష్ట‌మ‌ని ప్ర‌కాష్ రాజ్ అన‌డం వగైరా డ్రామాలు ర‌క్తి క‌ట్టించాయి. కానీ ఇప్పుడు అందుకు కాంట్రాస్ట్ గా మ్యాట‌ర్ న‌డుస్తోంది. మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.




Tags:    
  • Bandla Ganesh 
  • Latest news 
  • Producer 
  • Tollywood 

Similar News

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

Copyright @2026

Powered by Blink CMS