• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప‌వ‌న్ స్టార్‌ డ‌మ్‌ ని...

ప‌వ‌న్ స్టార్‌ డ‌మ్‌ ని బీట్ చేసిన శేఖ‌ర్ బ్రాండ్ ఇమేజ్‌

By - Tupaki Desk
Update: 2021-09-25 04:30 GMT
స్టార్ ప‌వ‌ర్ ‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న సినిమా వ‌చ్చిందంటే బాక్సాఫీస్ వ‌ద్ద ఆ సంద‌డే వేరు.. ఆ క్రేజే వేరు. అయితే ఆ క్రేజ్‌ని సెన్సిబుల్ డైరెక్ట‌ర్ బ్రాండ్ ఇమేజ్ ఇటీవ‌ల బీట్ చేసింది. దీంతో ట్రేడ్ వ‌ర్గాలు ఆశ్చ‌ర్యానికి.. షాక్‌ కు గుర‌వుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన తాజా చిత్రం `ల‌వ్‌ స్టోరీ`. నాగ‌చైత‌న్య‌.. సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీ ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

పాట‌ల‌తో రిలీజ్ ‌కు ముందే రికార్డులు సృష్టించి ప్రేక్ష‌కుల్లో భారీ క్రేజ్‌ ని సొంతం చేసుకున్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ప‌రంగా ఓవ‌ర్సీస్ మార్కెట్‌ లోనూ.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డును సృష్టించ‌డ‌మే కాకుండా శేఖ‌ర్ క‌మ్ముల బ్రాండ్ ఇమేజ్ కార‌ణంగా యూఎస్ మార్కెట్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్‌ సాబ్‌`ని క్రాస్ చేయ‌డం విశేషం. యూఎస్ ప్రీమియ‌ర్ షోస్ ద్వారా ఈ మూవీ 306కె యూఎస్ డాల‌ర్ల‌ని వ‌సూలు చేసింది. `వ‌కీల్ సాబ్‌` మాత్రం 300కె డాల‌ర్ల‌ని మాత్రం వ‌సూలు చేయ‌గ‌లిగింది.

దీంతో యుఎస్ మార్కెట్ ‌లో 2021లో అత్య‌ధిక ఓపెనింగ్స్‌ ని రాబ‌ట్టిన ద‌క్షిణాదికి చెందిన మొట్ట‌మొద‌టి చిత్రంగా నిలిచింది. ఆ త‌రువాత స్థానాల్లో వ‌కీల్ ‌సాబ్.. మాస్ట‌ర్‌.. జాతిర‌త్నాలు చిత్రాలు నిలిచాయి. అయితే ఓపెనింగ్ ప‌రంగా ఈ మూవీ రికార్డు సృష్టించినా టాక్ ప‌రంగా మాత్రం ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. రివ్యూస్ కూడా ఆశాజ‌నకంగా లేవు... ఈ వీకెండ్ ‌ని బ‌ట్టి ఈ మూవీ ఎంత వ‌ర‌కు క‌లెక్ట్ చేస్తుంద‌న్న‌ది చూడాలి.

ఇదిలా వుంటే ఈ మూవీ రిజ‌ల్ట్ ‌తో పాటు ఈ సినిమా చాలా మందిని థీయేట‌ర్ల‌కి మ‌ళ్లీ ర‌ప్పించి థియేట‌ర్ల‌ని క‌ళ‌క‌ళ లాడిస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈ సినిమా కోసం గ‌డ‌ప దాట‌తార‌ని థియేట‌ర్ల‌లోకి వ‌స్తార‌ని భావిస్తున్నారు. కానీ పాండ‌మిక్ స్కేర్ ఇంకా వారిని వెంబ‌డిస్తూనే వుంది. అయితే ఈ వారాంతం ఫుల్స్ ‌ని బ‌ట్టి ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం మాత్రం లేక‌పోలేదు.
Tags:    
  • Naga Chaitanya 
  • Sai Pallavi 
  • Sekhar Kammula 
  • Vakeel Saab 
  • Vakeel Saab premieres 
  • Love Story 
  • Love Story collections 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS