లివ్-ఇన్ కపుల్స్.. మీకో గుడ్‌ ఛాన్స్‌

Update: 2015-07-28 08:18 GMT
క్వీన్‌, తను వెడ్స్‌ మను విజయాలతో ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పేసుకుంది కంగన. అసలు హీరోతో పనే లేకుండా కేవలం లేడీ ఓరియెంటెడ్‌ కథలతోనే 100కోట్ల క్లబ్‌ సినిమాలు తీయొచ్చని ఈ రెండు సినిమాలు నిరూపించాయి. ఆ సక్సెస్‌ ఇచ్చిన కిక్కులోనే కంగన కెరీర్‌ పరంగా మరింత స్పీడ్‌ పెంచేసింది. ప్రస్తుతం ఓ నాలుగైదు సినిమాలు లైన్‌ లో ఉన్నాయి. అందులో 'కత్తి బత్తి' ఒకటి. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది.

'కత్తి బత్తి' కాన్సెప్టు కాస్త వివాదాస్పదమైనదే. ప్రస్తుతం సమాజంలో నిత్యం చర్చకొస్తున్న సహజీవనం అనే టాపిక్‌ పై తీసిన చిత్రమిది. పెళ్లికి ముందే ప్రేమికుల సహజీవనం అనేది తెరపై చూపిస్తున్నారు. కంగన సరసన ఇమ్రాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించాడు. నిఖిల్‌ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 18న రిలీజ్‌ కి వస్తోంది.

ఇక రిలీజ్‌ కి నెలరోజుల వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి ఇప్పట్నుంచే ప్రచారానికి రెడీ అవుతోంది టీమ్‌. రొటీన్‌ కి భిన్నంగా పబ్లిసిటీ ప్లాన్‌ చేస్తున్నారు. ప్రమోషన్‌ లో భాగంగా నిజ జీవితంలో లివిన్‌ రిలేషన్‌ షిప్‌ సాగిస్తున్న జంటల్ని ఓ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అక్కడ తమ అభిప్రాయాల్ని యథేచ్చగా తెలియజేయవచ్చు. సహజీవనంలో ఉన్న సరిగమల్ని నేరుగా కాస్టింగ్‌ తో కలిసి ముచ్చటించే అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ మీరు కూడా సహజీవనం చేస్తున్నవాళ్లే అయితే మీకో అద్భుత అవకాశమిది. గో అహెడ్‌.
Tags:    

Similar News