లైగ‌ర్ బ్యాచ్ అమెరికా వ‌దిలి రారా?

Update: 2021-12-04 11:34 GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో `లైగ‌ర్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కి చేరుకుంది. ప్ర‌స్తుతం అమెరికాలో షూటింగ్ జ‌రుగుతోంది. కొద్ది రోజులుగా యూనిట్ యు.ఎస్.ఏ లోనే కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ - బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. తాజాగా లాస్ ఎంజెల్స్ షెడ్యూల్ కూడా పూర్త‌యింది.

మైక్ టైస‌న్ తో షూటింగ్ లో భాగంగానే యూనిట్ అమెరికా వెళ్లింది. అప్ప‌టి నుంచి ఏక‌ధాటిగా మైక్ టైస‌న్ పై స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఎట్ట‌కేల‌కు టైస‌న్ షెడ్యూల్ పూర్త‌యిన‌ట్లు యూనిట్ అధికారికంగా తెలిపింది.

మ‌రి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? అన్న‌ది యూనిట్ హైద‌రాబాద్ వ‌స్తే గానీ క్లారిటి రాదు. అయితే టైస‌న్ తో షెడ్యూల్ పూర్తిచేసిన అనంత‌రం టీమ్ అంతా హోట‌ల్ లో పెద్ద పార్టీ చేసుకున్నారు.

అందులో టైస‌న్ కూడా పాల్గొన్నారు. తాజాగా లాస్ ఎంజెల్స్ లో ఫేమ‌స్ చెఫ్ సాల్ట్ బే ముందు లైగ‌ర్ బ్యాచ్ అంతా నుంచొని ఫోటోలు దిగింది. ఇందులో పూరి జ‌గ‌న్నాధ్.. చార్మి.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నారు. ముగ్గురు క‌లిసి ఈ ఫోటోని షేర్ చేసుకున్నారు.

సినిమాకి సంబంధించి మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుతున్నాయి. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. స్పోర్ట్స్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయ‌డం పూరికి ఇదే తొలిసారి. త‌న‌దైన శైలిలో క‌మ‌ర్శియ‌లైజ్ చేసి తెర‌కెక్కిస్తున్నారు. పూర్తి మార్క్ చిత్రంగానే ఫోక‌స్ అవుతోంది.

అయితే కంటెంట్ ప‌రంగా కొత్త‌ద‌నం ఏదైనా ఉంటుందా? అంటే అది స్పోర్స్ట్ నేప‌థ్య‌మ‌న్న‌దే ఎక్కువ‌గా హైలైట్ అవ్వాల్సి ఉంది. ఇస్మార్ట్ శంక‌ర్ తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన పూరి మ‌ళ్లీ గ‌త వేగాన్ని అందుకుంటాడా? లేదా? అన్న‌ది `లైగ‌ర్` డిసైడ్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇక `లైగ‌ర్` చిత్రాన్ని తెలుగు..హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. పూరి-చార్మి-బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. య‌శ్ రాజ్ ఫిలింస్ చిత్రాన్ని పంపిణీ చేస్తోంది.




Tags:    

Similar News