కబాలిని నోటిస్ ఏమి చేస్తుంది?

Update: 2017-05-14 06:03 GMT
సినిమాను అభిమానించే ప్రతీవాడు ఇష్టపడే నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. అయన నడిస్తే చాలు జనాలు థియేటర్ల ముందు క్యూ కడతారు. ఇది అతిశయోక్తి కాదు గత 20  ఏళ్లుగా జరుగుతున్న నిజం. అతని క్రేజ్ మన సౌత్ లోనే కాదు జపాన్ మలేసియా వంటి దేశాల్లో కూడా చూడొచ్చు.  అలాంటి రజినీకాంత్ నిన్న కబాలితో వచ్చి తన పొగురున్న నడకతో అభిమానులును ఆనందపరిచారు. సినిమా ఫ్లాపైనా కూడా కోట్ల రూపాయలు వసూలు చేశారు.  

ఇకపోతే కబాలి డైరెక్టర్ రంజిత్ పా  ఇప్పుడు మళ్ళీ ఒక పేరుబడ్డ మాఫియా లీడర్ హాజీ మస్తాన్ జీవితం ఆదారంగా ఒక కథను తయారుచేసి రజినీకాంత్ కు వినిపించాడు. దానికి రజినీకాంత్ కూడా సై అనేశాడు. ఈ సినిమాను నటుడు అతని అల్లుడు అయన ధనుష్ నిర్మిస్తున్నాడు. ఇంకా షూటింగ్ మొదలు కాని.. ఈ సినిమా కోసం బాలీవుడ్ నటిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు సమస్య అంతా  హాజీ మస్తాన్ కొడుకుతో వచ్చింది. 

అతని తండ్రిని ఒక స్మగ్లర్ గా మాఫియా లీడర్ గా చూపించడం మా నాన్నకు పరువు తక్కవ అవుతుంది అని ఒక నోటిస్ ఇచ్చాముని సుందర్ శేఖర్ అనే అతని మీడియాకు చెప్పాడు. ఈయన డాన్ హాజీ మస్తాన్ కొడుకట. దీనికి రజినీకాంత్ కానీ ఆ చిత్రా నిర్మాణ సంస్థ కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వనేలేదు. కాకపోతే ఈ సినిమా కథాంశం అదేనా కాదా అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదులే.

Similar News