12 ఏళ్ల 'జోదా అక్బర్' సెట్ అగ్నికి ఆహుతి
హృతిక్ రోషన్ మరియు ఐశ్వర్య రాయ్ 2008 లో నటించిన జోదా అక్బర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన రాజ మహల్ సెట్ తో పాటు ఇతర సెట్ లకు మంచి పేరు వచ్చింది. మహారాష్ట్రలోని కర్జాత్ రోడ్డు ఎన్డీ స్టూడియోలో ఉండే ఈ సెంట్టింగ్ లో గత 12.. 13 ఏళ్లుగా పదుల సంఖ్యలో సినిమాల షూటింగ్ లు జరిగాయి. కేవలం బాలీవుడ్ సినిమాల షూటింగ్ లు మాత్రమే కాకుండా అందులో సౌత్ సినిమాల షూటింగ్ లను కూడా నిర్వహించారు. సినిమా కు జ్ఞాపకంగా నిలిచి పోయిన ఆ సెట్టింగ్ అగ్నికి ఆహుతి అయ్యింది.
ఎన్డీ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఈ సెట్టింగ్ పూర్తిగా కాలి పోయినట్లుగా బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు. పైబర్ మరియు చెక్కతో వేసిన ఈ సెట్టింగ్ చాలా ఆకర్షణీయంగా ఉండేదని.. అందమైన జోదా అక్బర్ సెట్టింగ్ కాలి పోవడం చాలా బాధగా ఉందంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. ఆ సెట్టింగ్ తో బాలీవుడ్ వర్గాల వారికి మాత్రమే కాకుండా చాలా మంది సినీ ప్రముఖులకు అనుబంధం ఉంది. ఆ ప్రమాదం పై పలువురు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పలు ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలంకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది.
Full View Full View Full View