ఆ ఒక్క‌ అప‌ప్ర‌ద త‌ప్ప ఇంకేమీ పోయేదేం లేదు

Update: 2020-11-18 09:10 GMT
సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి స‌క్సెస్ సాధించిన ద‌ర్శ‌కులెంద‌రో ఉన్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ .. ప్ర‌భుదేవా .. ఈ కోవ‌కే చెందుతారు. సీనియ‌ర్లు అయిన మ‌ణిర‌త్నం .. శంక‌ర్ ప్ర‌భావం నార్త్ పై త‌క్కువేమీ కాదు.

అయితే కొరియోగ్రాఫ‌ర్ ట‌ర్న్ డ్ ప్ర‌భుదేవా అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టినట్టు తాను కూడా వ‌రుస పెట్టి విజ‌యాలు అందుకోవాల‌ని క‌ల‌లుగ‌న్న లారెన్స్ ప‌రిస్థితి మాత్రం ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ప్ర‌స్తుతానికి అత‌డు నార్త్ క‌ల‌లు వ‌దిలి సౌత్ క‌ల‌లకు ప‌రిమిత‌మైతేనే మంచిద‌ని అది స‌‌రిపోతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

అక్క‌డ తీసిన ఆ ఒక్క సినిమా ఫ్లాపైనా అత‌డికి వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. కిలాడీ అక్ష‌య్ హీరోగా తెర‌కెక్కించిన ల‌క్ష్మీ (కాంచ‌న రీమేక్) ఫ్లాపైనా ఇప్పుడు ఆయ‌న‌కు పోయిందేమీ లేదు. వ‌రుస విజ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న అక్కీకి ఫ్లాప్ ఇచ్చాడ‌న్న అప‌ప్ర‌ద త‌ప్ప ఇంకేదీ పోయేదేం లేదు. సౌత్ లో ఆయ‌న రేంజు ఆయ‌న‌కు ఉంది. కాంచ‌న ఫ్రాంఛైజీని ఇక్క‌డ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేసే కాలిబ‌ర్ లారెన్స్ మాస్టార్ కి ఉంది. ఈ ఫ్రాంఛైజీలో వ‌రుస‌గా సినిమాలు తీసి ఇక్క‌డ స‌త్తా చాటుతాడ‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

తెలుగు త‌మిళంలో లారెన్స్ కి  అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఫిలింవ‌ర్గాల్లో ఇమేజ్ ఉంది. అందుకే ఆయ‌న‌ మార్కెట్ చెక్కు చెద‌ర‌దు. హిందీలో చేసిన ప్ర‌యోగం విఫ‌ల‌మైనా .. అక్క‌డా అత‌డికి మ‌రో ఛాన్స్ రాక‌పోదు అన్న బెంగ కూడా ఏమీ లేదు. కాక‌పోతే ఎంతో ఆశిస్తే ఇంకేదో అయ్యింది అన్న చందంగా ల‌క్ష్మి ఫ్లాప‌వ్వ‌డ‌మే పెద్ద నిరాశ‌. 1 రేటింగ్ 2 రేటింగుల‌తో ల‌క్ష్మి సినిమాని క్రిటిక్స్ తూర్పార‌బ‌ట్టాక సాగుతున్న‌ విశ్లేష‌ణ ఇది.
Tags:    

Similar News