అస్వస్థతతో ఆసుపత్రిలో లారెన్స్

Update: 2017-01-22 04:24 GMT
ప్రముఖ నటుడు.. కొరియోగ్రాఫర్ లారెన్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.తీవ్రమైన మెడ నొప్పితో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. జల్లికట్టుపై విధించిన బ్యాన్ ను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది తమిళులు మెరీనాబీచ్ దగ్గర నిరసనలు చేయటం తెలిసిందే. దీనికి పూర్తిగా మద్దతు ఇవ్వటమేకాదు.. దాదాపు రూ.కోటి విలువైన ఆహారపదార్థాలు.. నిత్యవసర వస్తుల్ని ఆయన ఇవ్వటం తెలిసిందే.

మెరీనా బీచ్ వద్దకు వచ్చిన లారెన్స్ మెడకు గార్డు పెట్టుకొనే వచ్చారు. కాసేపు అక్కడుఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవటంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన్నుచెన్నైలోని పల్లవి ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News