• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ కి జోడిగా అందాల...

పవన్‌ కి జోడిగా అందాల రాక్షసి

By - Tupaki Desk
Update: 2020-03-16 04:00 GMT
గత కొంత కాలంగా సరైన ఛాన్స్ లు లేవని.. స‌క్సెస్ అంద‌ని మావి అయ్యింద‌ని తెగ క‌ల‌త చెందుతోంది లావణ్య త్రిపాఠి. ఇక లాభం లేదు.. మన వంతు ప్రయత్నం గ‌ట్టిగా చేయాల్సిందేన‌ని నిర్ణయించుకుంది. అందుకు త‌గ్గ‌ట్టే నిరంత‌రం ఘాటైన ఫోటో షూట్ల‌తో రెచ్చిపోతోంది. కాస్త ప‌ట్టు విడుపు ఉండాలి అని డిసైడ్ అయిన‌ట్టుంది. తన అందాలను యూత్ కి ఎరగా వేయడం ప్రారంభించింది. అటుపై ప‌దిమంది దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్ప‌టికే తమిళంలో ఓ ఛాన్స్ ని అందుకుంది. అధర్వ సరసన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దీంతోపాటు నిఖిల్ స‌ర‌స‌న నటించిన `అర్జున్‌ సురవరం` విజయం త‌న‌కు కలిసొచ్చింది. ఇంతేనా? అనుకుంటుండ‌గానే.. ఊహించ‌ని విధంగా ఈసారి ఏకంగా బంపరాఫర్ త‌గిలింది.

ఏకంగా పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సరసన నటించే అరుదైన అవకాశాన్ని లావణ్య కొట్టేసినట్టు తెలుస్తుంది. రాజ‌కీయాల్లోకి వెళ్లాక‌.. రెండేళ్ళ గ్యాప్‌ తర్వాత పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ `పింక్` రీమేక్ లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అంజలి- నివేదాథామస్‌ లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిలుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని సందేశాత్మకంగానే కాకుండా పవన్‌ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్‌ హంగులు జోడించి మెసేజ్‌ తో కూడిన కమర్షియల్‌ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా పవన్‌ సరసన ఇద్దరు కథానాయికలను పెట్టే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.

ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్ లో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉంటుందట. అందులో ఓ అమ్మాయిగా శృతి హాసన్ ని అనుకుంటున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌ పాత్ర కోసం లావణ్య త్రిపాఠిని సంప్రదించారట. పవన్‌తో సినిమా అనేసరికి ఈ భలేభలే మగాడివోయ్‌ బ్యూటీ ఎగిరి గంతెసిందట. మరి పవన్‌కి జోడిగా ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారా? లేక శృతి.. లావణ్యలో ఎవరో ఒకరినే ఎంపిక చేస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సమ్మర్‌ స్పెషల్ గా మేలో విడుదల కానుంది.

లావణ్య ప్రస్తుతం తెలుగులో `ఏ1 ఎక్స్ ప్రెస్‌` చిత్రం లో సందీప్‌ కిషన్‌ సరసన నటిస్తోంది. హాకీ నేపథ్యం లో సాగే ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ గా కనిపించనుంది. జీవన్‌ కనుకోలను దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు పలు నయా సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
Tags:    
  • Lavanya Tripathi to romance Pawan Kalyan 
  • Vakeel Saab First Look 
  • Vakeel Saab 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Vakeel Saab Distributors 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS