సోగ్గాడితో వద్దే వద్దు అన్నారట

Update: 2020-05-01 04:32 GMT
అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకోవడంతో ఆ తర్వాత మంచి ఆఫర్లే వచ్చాయి. కాని లక్‌ కలిసి రాకపోవడమో లేక మరేంటో కాని అమ్మడి కెరీర్‌ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటి వరకు నాగార్జునతో మినహా పెద్ద స్టార్స్‌ తో నటించే అవకాశాలు రాలేదు. చిన్నా చితకా హీరోలతోనే ఈ అమ్మడు కెరీర్‌ నెట్టుకు వస్తుంది.

నాగార్జునతో చేసిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం మంచి హిట్‌ అయ్యింది. అయితే ఆ సినిమాలో ఈమె పాత్రను రమ్యకృష్ణ డామినేట్‌ చేసింది. ఆ సినిమాతో ఈమెకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. ఆ సినిమా ఆఫర్‌ వచ్చిన సమయంలో పలువురు శ్రేయోభిలాషులు మిత్రులు నాగార్జునతో సినిమా వద్దంటే వద్దన్నారట. సీనియర్‌ హీరోతో సినిమా చేస్తే ఇకపై వచ్చేవన్నీ కూడా అలాంటి ఛాన్స్‌ లే అయ్యి ఉంటాయంటూ హెచ్చరించారట. దాంతో అనుమానంతోనే ఆ సినిమా చేసిందట.

తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం నాకెన్నో మంచి విషయాలను నేర్పింది. షూటింగ్‌ సమయంలో నాగార్జున గారు చక్కని గైడెన్స్‌ ఇచ్చారు. ఇప్పటికి కూడా ఏదైనా సలహాలు కావాలంటే నాగార్జున గారిని అడుగుతానంది. ఇక కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్‌ అవ్వడంపై స్పందిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమాలకు కమిట్‌ అవ్వాల్సి వచ్చింది.

కొన్ని సినిమాలు ఆడవని తెలిసినా కూడా ముందు నుండి ఉండే కమిట్‌ మెంట్స్‌ కారణంగా నటించాల్సి ఉంటుందని.. ఇకపై అలాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లుగా చెప్పిన లావణ్య త్రిపాఠి మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్లుగా చెప్పింది. తన కెరీర్‌ పై ఈ అమ్మడికి చాలా ఆశలు ఉన్నట్లుగా ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే అనిపిస్తుంది.
Tags:    

Similar News