• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాకిస్తున్న ప్ర‌భాస్‌,...

షాకిస్తున్న ప్ర‌భాస్‌, రాఖీభాయ్ క్రేజీ డీల్‌

By - Tupaki Desk
Update: 2022-03-16 06:32 GMT
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1'. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు అంద‌ని విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు దేశ వ్యాప్తంగా వున్న స్టార్ ల‌ని విస్మ‌యానికి గురిచేసింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఈ మూవీ త‌రువాత ఇందులో నటించిన హీరో య‌ష్ కు, ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కు భారీ క్రేజ్ తో పాటు హ్యూజ్ డిమాండ్ ఏర్ప‌డింది.

త్వ‌ర‌లో ఈ మూవీకి సీక్వెల్ గా వ‌స్తున్న 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల కాబోతోంది. తొలి భాగం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి రికార్డులు సృష్టించ‌డంతో చాప్ట‌ర్ 2 కోసం యావ‌త్ దేశం వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కు ముందే ఈ క్రేజ్ కార‌ణంగా చాప్ట‌ర్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌న‌రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 14న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ ఐదు భాష‌ల్లో రికార్డు స్థాయిలో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప్రి రిలీజ్ బిజినెస్ ప‌రంగా ఈ మూవీ వార్త‌ల్లో నిలిచింది.

ఈ మూవీ త‌రువాత ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్‌' మూవీని చేస్తున్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇండులో హీరో. హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ప్ర‌బాస్ కు జోడీ గా శృతి హాస‌న్ న‌టిస్తోంది. దాదాపు చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలుస్తోంది. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కుల్లోనూ,  ట్రేడ్ వ‌ర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ ఓవ‌ర్సీస్ బిజినెస్ రికార్డు స్థాయిలో జ‌రిగింద‌ని తెలిసింది. ఇటీవ‌లే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2, స‌లార్ చిత్రాల ఓవ‌ర్సీస్ బిజినెస్ ని మేక‌ర్స్ పూర్తి చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన ఓవ‌ర్సీస్ రైట్స్ రికార్డు స్థాయికి అమ్ముడు పోయినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ కు చెందిన ఫార్స్ ఫిలింస్ సంస్థ ఈ రెండు చిత్రాల ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని 100 కోట్ల రికార్డు మొత్తానికి సొంతం చేసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాహుబ‌లి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల త‌రువాత ఇదే భారీ డీల్ అని ఓవ‌ర్సీస్ చ‌రిత్ర‌లోనే ఈ టీల్ ఓ రికార్డ్ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌భాస్ న‌టిస్తున్న 'స‌లార్' ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. ఇందులో ర‌గ్గ్‌డ్ క్యారెక్ట‌ర్ లో ప్ర‌భాస్ మాఫియా డాన్ గా క‌నిపించ‌బోతున్నారు. దీంతో ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇక చాప్ట‌ర్ 1 హ్యూజ్ హిట్ కావడంతో 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' పై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. బాహుబ‌లి పార్ట్ 2 కోసం సినీ ప్రియులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూశారో ఈ చాప్ట‌ర్ 2 కోసం కూడా అంతే ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

దీంతో పార్ట్ 2 పై బిజినెస్ ప‌రంగానూ భారీ క్రేజ్ ఏర్ప‌డింది. అదే ఓవ‌ర్సీస్ రైట్స్ విష‌యంలో స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు. ఏప్రిల్ 14న విడుద‌ల కానున్న 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
Tags:    
  • Prabhas 
  • Yash 
  • Salar 
  • KGF2 
  • Movies 
  • PrashanthNeil 
  • Tollywood 
  • RebelStar 
  • KGFChapter2 
  • Films 

Similar News

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS